English   

పెళ్ళికొడుకు కాబోతున్న ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్..

Hero Tarun
2020-09-16 12:46:50

2020లో చాలా దారుణాలు జరిగాయి. ఎన్నో విషాదాలు మన కళ్లముందే ఇంకా ఉన్నాయి. అయితే ఇన్ని విషాదాల మధ్య కూడా కొన్ని మంచి వార్తలు వినిపిస్తున్నాయి. అదే మన హీరోల పెళ్లి భాజాలు. ఇప్పటికే ఈ ఏడాది నితిన్, నిఖిల్, దగ్గుబాటి రానా ఒక ఇంటివారయ్యారు. నిర్మాత దిల్ రాజు కూడా రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మరో హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆయన మరెవరో కాదు ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్. దాదాపు 20 ఏళ్ల కింద నువ్వేకావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు తరుణ్. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. వెంటనే ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక చేతులెత్తేశాడు. కొన్నేళ్లుగా ఆయన సినిమాలు చేయడం మానేశాడు. హాయిగా తన బిజినెస్ చేసుకుంటున్నాడు తరుణ్. 37 ఏళ్ల ఈ హీరోకి ఇప్పుడు పెళ్లి చేయాలని చూస్తుంది వాళ్ళ అమ్మ రోజారమణి. చాలా కాలంగా ఈయనకు సంబంధాలు చూస్తున్న ఈమె ఇప్పుడు ఒక అమ్మాయిని ఫిక్స్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళ స్నేహితురాలి కూతురిని తరుణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది రోజారమణి. త్వరలోనే తరుణ్ పెళ్లి వార్త అధికారికంగా ప్రకటించనున్నారు. 

More Related Stories