English   

మహేష్ బాబు మేన‌ల్లుడి టీజ‌ర్ విడుద‌ల‌

HERO
2021-06-23 17:36:21

మహేష్ మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా హీరో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇవాళ అనగా గా జూన్ 23 వ తేదీన 11 గంటల 48 నిమిషాలకు మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ అశోక్ గ‌ల్లా మొదటి సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది . మరియు చాలా ఎగ్జైట్మెంట్ గా కూడా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం కావాలని ,ఈ సినిమా బృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అంటూ మహేష్ బాబు తెలిపాడు .ఈ టీజర్ లో అశోక్ గల్లా కౌబాయ్ గెటప్ లో క‌నిపించారు. 

అంతే కాకుండా టీజర్ చివ‌రిలో జోకర్ గెటప్ లో కనిపించాడు. ఈ సినిమాలో హీరో విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న‌ట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. అంతే కాకండా ఈ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్ గా ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా జగపతిబాబు, బ్రహ్మాజీ, నరేష్ , వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.  పద్మావతి గల్లా గారు అమర రాజా మీడియా పేరు మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు త్వ‌ర‌లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

More Related Stories