English   

శ‌ర‌త్ కుమార్ కూతురుతో విజ‌య్ వైరం.. 

Vijay-Varalaxmi

త‌మిళ‌నాట విజ‌య్ కు చాలా మంచి పేరుంది. ఎవ‌రితోనూ శ‌తృత్వం పెట్టుకోడని.. మ్యాగ్జిమ‌మ్ వివాదాల‌కు దూరంగా ఉంటాడ‌ని విజ‌య్ కు చాలా మంచి పేరుంది. ఇప్పుడు కూడా మ‌నోడు ఇదే కంటిన్యూ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఓ అమ్మాయితో వైరం పెంచుకుంటున్నాడు విజ‌య్. అది కూడా శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మితో. అవును.. మీరు వింటున్న‌ది నిజ‌మే. నిజంగానే ఇప్పుడు విజ‌య్ ఆమెతో శ‌తృత్వం పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ తో విజ‌య్ కు వైరం సినిమా కోస‌మే. ప్ర‌స్తుతం ఈయ‌న మురుగ‌దాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ రెండు పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నాడు. స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత మురుగ‌దాస్ చేస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో విల‌న్ల‌కు కొద‌వేం లేదు. ఇప్ప‌టికే ఇద్ద‌రు విల‌న్లు ఉన్నారు ఈ చిత్రంలో. ఇప్పుడు మూడో విల‌న్ గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ చేరిపోయింది. ఈమెకు ఇప్పుడు హీరోయిన్ గా అవ‌కాశాలు చాలా క‌ష్టం. దాంతో కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిపోతుంది. అందులోనూ విజ‌య్ లాంటి సూప‌ర్ స్టార్ సినిమాలో న‌టిస్తే క‌చ్చితంగా వ‌చ్చే క్రేజే వేరు. అందుకే మురుగ‌దాస్ సినిమా కోసం ప్ర‌తినాయ‌కురాలిగా మారిపోయింది వ‌ర‌ల‌క్ష్మి. మ‌రి విజ‌య్ తో వైరం వ‌రానికి ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలిక‌..!

More Related Stories