English   

జయలలిత ఆస్తులపై సర్వహక్కులు వాళ్లవే.. హై కోర్ట్ సంచలన తీర్పు..

jayalalitha
2020-05-28 19:53:52

జయలలిత.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఓ రాష్ట్రానికే అమ్మ.. అందరి బాధలు అర్థం చేసుకున్న అమ్మ. కానీ చివరికి తన బాధను మాత్రం అర్థం చేసుకోడానికి ఎవ్వరూ లేకుండా పోయారు. చివరి రోజుల్లో ఈమె నరకం చూసిందని కొన్ని తమిళ పత్రికలు కూడా రాసాయి. ఇక వేల కోట్లకు అధిపతి అయిన జయలలిత.. చివరికి ఏం లేకుండానే పోయింది. ఈమె కోట్లాది రూపాయల ఆస్తి ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటి వరకు రచ్చ జరుగుతూనే ఉంది. తిరుగులేని నేతగా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం.. 70 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండటం.. ఎప్పుడు అడిగినా కూడా అమ్మ బాగానే ఉందని చెప్పి చివరికి ఆమె శవాన్ని బయటికి తీసుకొచ్చారు. దీనిపై అప్పట్లో చాలా దుమారమే రేగింది. అపోలో ఆసుపత్రిపై కూడా విమర్శలు చాలానే వచ్చాయి.

ఆమె ట్రీట్ మెంట్ మీద సందేహాలు.. అసలు ఏం జరిగిందనే విషయంపై తెలియని సంగిగ్ధం.. ఎన్నో ఆరోపణలు ఇలా ఎన్నో అమ్మ చావు చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మకు అత్యంత ప్రాణపదమైన పోయెస్ గార్డెన్ ను మ్యూజియంగా మార్చాలని కొంతకాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా అమ్మ ఆస్తులన్నీ ఆమె మేనకోడలు దీపతో పాటు మేనల్లుడు దీపక్ సొంతమని సంచలన తీర్పు ఇచ్చింది మద్రాస్ హై కోర్ట్. జయలలిత ఆస్తులు దాదాపు 913 కోట్లకు వారసులు వాళ్లే అని హై కోర్టు తీర్పిచ్చింది. ఇకపై ఆమె ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్లకే సొంతమని తేల్చేసింది న్యాయస్థానం.

ఇక చెన్నైలోని జయలలిత ఇంటిలో కొంత భాగాన్ని ఆమె స్మారకంగానూ.. మరికొంత భాగాన్ని సీఎం కార్యాలయంగానూ(వేద నిలయం) మార్చాల‌ని హైకోర్టు పేర్కొంది. తమ సూచనలపై తగిన జవాబు ఇవ్వాల్సిందిగా తమిళనాడు స‌ర్కార్ కు మద్రాస్ హైకోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. ఇక ఆ స్థలం కూడా ఎంత ఇస్తారనేది జయలలిత వారసుల యిష్టమని హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎన్.కిరుబకరణ్, జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి కొన్నేళ్లుగా కోర్టులోనే ఉన్న ఆస్తుల గొడవపై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

 

More Related Stories