English   

ఇంత‌కీ మీటింగ్ సారాంశ‌మేంటి..?

chiru-mahesh
2018-04-25 09:53:14

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ లేని ప‌రిస్థితులు ఇప్పుడు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో ఇండ‌స్ట్రీలో ఏవేవో కొత్త కొత్త విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఎప్ప‌ట్నుంచో ఉన్న‌వే అయినా ఇప్పుడే వాటికి రెక్క‌లొచ్చాయి. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి చ‌ర్చ బాగా ఎక్కువైంది. దానికి తోడు మీడియా కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఇండ‌స్ట్రీ గురించి మాట్లాడ‌టం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ధ్య‌లోకి తీసుకురావడం.. అవ‌స‌రం లేక‌పోయినా ఆయ‌న‌ పేరు తీసుకొచ్చి మ‌రీ తిట్టించ‌డం.. ఇవ‌న్నీ చేసేస‌రికి ఇండ‌స్ట్రీ మొత్తం క‌దిలింది. ఇత‌ర విష‌యాల్లో ఎలా ఉన్నా.. ఇండ‌స్ట్రీ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి అంతా ఒక్క‌టే అని నినాదం ఇచ్చేసారు. ఇప్పుడు ఇదే మీటింగ్ కూడా జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ జ‌ర‌గ‌ని స్థాయిలో అన్న‌పూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి సార‌థ్యంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా క‌లిసారు. ఇందులో చ‌ర‌ణ్, బ‌న్నీ, నాని, రామ్ లాంటి కుర్ర హీరోలు కూడా ఉన్నారు.

చిన్నా పెద్ద అంద‌ర్నీ క‌లుపుతూ సాగిన ఈ  మీటింగ్ లో మీడియా ఛానెల్స్ పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు. అల్లు అర‌వింద్ లాంటి వాళ్లైతే ఇప్పుడు అలిగేష‌న్స్ మోస్తోన్న ఆ మూడు న్యూస్ ఛానెల్స్ ను పూర్తిగా బాయ్ కాట్ చేయాల‌ని ప్ర‌తిపాదించార‌ని తెలుస్తుంది. అయితే దీనికి కొంద‌రు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. బాల‌య్య అయితే ఇలాంటి వాటిని అస్స‌లు ఎంక‌రేజ్ చేయ‌లేద‌ని తెలుస్తుంది. ఇక చిరంజీవి కూడా అల్లు వారి నిర్ణ‌యాన్ని సున్నితంగా తిరస్క‌రించిన‌ట్లు స‌మాచారం. కేవ‌లం ఎంట‌ర్ టైన్మెంట్ ఛానెల్స్ కు మాత్ర‌మే యాడ్స్ ఇచ్చి.. న్యూస్ ఛానెల్స్ లో ఒక్క అర‌గంట మాత్ర‌మే ఎంట‌ర్ టైన్మెంట్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అల్లు అర‌వింద్ చెప్పిన‌ట్లు టాక్. కానీ దీనికి ఏ ఒక్క‌రు కూడా అంగీకారం తెల‌ప‌లేదు.

త‌ప్పు చేసింది కొంద‌రైతే అంద‌రికీ శిక్ష ఎందుకు అనే టాక్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. దాంతో మ‌రో కోణంలో కూడా ఆలోచించారు. మొత్తానికి ప‌వ‌న్ ఎఫెక్ట్ ఇప్పుడు మీడియాపై బాగానే క‌నిపిస్తుంది. ఏ చిన్న విష‌యం జ‌రిగినా ప‌నిలేని ముగ్గురు న‌లుగుర్ని తీసుకొచ్చి డిబేట్లు గంట‌లు గంట‌లు న‌డిపే కొన్ని చెత్త ఛానెల్స్ కు ఇప్పుడు న్యూస్ లేకుండా పోయింది పాపం. వాళ్ల ప‌రిస్థితి మింగ‌లేక కక్క‌లేక అన్న‌ట్లు మారిపోయింది. వారం రోజుల నుంచి ప‌వ‌న్ ఎగ‌ర‌వేసిన తిరుగుబాటు బావుటాతో పాపం బిక్క చ‌చ్చిపోయి ఉన్నారు ఆ మీడియా ప్ర‌థినిథులు. ఇప్పుడు ఇండ‌స్ట్రీ కూడా ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు తెర‌తీస్తుండ‌టంతో ఇప్ప‌ట్నుంచీ మీడియా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప‌ని చేస్తుందేమో..?

More Related Stories