English   

హిప్పీ టీజర్....ఈసారి బండి రివర్స్ గేర్ !

Hippi-Movie
2019-03-20 11:35:55

ఆరెక్స్ 100 సినిమా ఘన విజయం సాదించడంతో క్రేజీ హీరోగా మారాడు ఆ సినిమా హీరో కార్తికేయ. ఆయన తన తర్వాతి సినిమా హిప్పీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ బాషలలో రూపొందుతోంది. కలైపులి ఎస్ దాను నిర్మిస్తున్న ఈ సినిమాని టీఎన్ కృష్ణ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, స్టిల్స్ యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచుతున్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా టీజర్‌ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా లాంచ్ అయింది.

హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ చూశాక ఇదేంట్రా బాబూ ఈ సినిమా మొత్తం ఆర్ఎక్స్100 కి రివర్స్ గా ఉందని అన్పిస్తుంది. ఎందుకంటే ఆరెక్స్ 100లో నిఖార్సయిన ప్రేమికుడిగా కనిపించిన కార్తిక్ ఈ సినిమాలో ప్లే బాయ్ లా కనిపిస్తూన్నాడు. ఇక వెన్నెల కిషోర్ తో మందు వేస్తూ జరిపే సంబాషణ హైలైట్, అంతేకాక హీరోయిన్ తో లిప్ లాక్స్, ఆ హగ్గులు చూస్తే ఈ సినిమా కూడా హిట్ కోట్టేస్తాడేమో అనేంతలా ఉంది టీజర్. ఈ సినిమా తెలుగు, తమిళ బాషలలో తెరకెక్కుతోంది. చూడాలి ఈ సినిమా ఆయనకు విజయాన్ని అందిస్తుందో లేదో ?  

More Related Stories