English   

హిప్పీ రివ్యూ

Hippi
2019-06-06 15:10:16

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు కార్తికేయ. ఆయన హీరోగా తెరకెక్కిన  రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ హిప్పీ. ఆర్‌ఎక్స్‌ 100లో బోల్డ్‌ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలో కూడా అలాగే రెచ్చిపోయినట్టు తీజర్సం ట్రైలర్స్ లో కలరింగ్ ఇవ్వడం, తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌ కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా సినిమా నిర్మించడంతో ఈ సినిమా మీద గట్టిగానే అంచనాలు నెలకొన్నాయి. తమిళ దర్శకుడు టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిప్పీలో ఈ యంగ్‌ హీరో స్టైలిష్‌ మేకోవర్‌తో  ఏ మేరకు ఆకట్టుకున్నాడు అనేది రివ్యూలో చూద్దాం.

కధ :

హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌)  ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేసి మార్షల్‌ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహ (జజ్బా సింగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్నేహతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫ్రెండ్‌ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి తొలి చూపులోనే రెండో సారి ప్రేమలో పడతాడు. స్నేహను కాదని ఆముక్తమాల్యద చుట్టూ తిరుగుతుంటాడు. దేవాకి ఇన్నాళ్లు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకున్న స్నేహ, వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. తరువాత హిప్పీ, ఆముక్తమాల్యదలు క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తుంటారు. అయితే ఆముక్తమాల్యద తన కంట్రోల్ లో పెట్టుకునేందుకు హిప్పీకి నరకం చూపిస్తుంది. చెప్పినట్టు వినాలని, చెప్పిన టైంకి రావాలని నరకం చూపెడుతుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు..? చివరకు హిప్పీ, ఆముక్తమాల్యదలు ఏమయ్యారు  అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :

హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం, చిన్న చిన్న విషయాల వలన విడిపోవటం, తిరిగి కలవటం లాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెర మీద చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే రొటీన్ కాన్సెప్ట్‌కు కాస్త స్పైసీ టచ్ ఇచ్చి లైన్ చేశాడు దర్శకుడు టీఎన్‌ కృష్ణ. అయితే మసాలా విషయంలో  కాస్త లిమిట్స్‌ క్రాస్‌ చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. లైన్ గా బాగునా కథనం సుధీర్ఘంగా ఉండి ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కార్తికేయ రొమాంటిక్ స‌న్నివేశాల్లో ‘ఆర్ఎక్స్‌100’ని మ‌రోసారి గుర్తు చేశాడు. దిగంగ‌న అందం సినిమాకు మరో హైలైట్‌. ప్రతీ ఫ్రేమ్‌లోనూ అందంగా కనిపించింది. హిప్పీ బాస్ పాత్రలో ఒదిగిపోయాడు జేడీ చక్రవర్తి. తెలంగాణ యాసతో అలరించాడు. జ‌జ్బాసింగ్‌, శ్రద్ధా దాస్ ,వెన్నెల‌ కిషోర్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. సినిమాలో మేజర్ మైనస్ క‌థ‌, క‌థ‌నం , కామెడీ లేకపోవడం. స‌న్నివేశాల‌న్నీ సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ఇక ఎక్కడా కొత్తద‌నం ఏమీ లేదు. నివాస్ కె.ప్రస‌న్న నేప‌థ్య సంగీతం బాగుంది. రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన బ‌లం. కత్తెరకి మ‌రింత ప‌ని పెట్టాల్సింది.  

చివరగా : యూత్ కి కనెక్ట్ అయ్యే హిప్పీ. 

రేటింగ్ : 2 /5

More Related Stories