English   

ఎఫ్ 2 చూస్తుంటే చిరాకొచ్చింది.. విశ్వక్ సేన్ సంచలనం..

f2
2020-03-31 20:35:57

ఎఫ్ 2.. అనిల్ రావిపూడిని స్టార్ డైరెక్టర్ గా మార్చిన సినిమా. 2019 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా.. ఒకటి రెండు కాదు.. ఏకంగా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దిల్ రాజు పంట పండించిన సినిమా.. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. ఇలాంటి సినిమాను పట్టుకుని ఎవరైనా నచ్చలేదంటారా..? అన్నాడు.. ఇప్పుడు విశ్వక్ సేన్ ఇదే అన్నాడు. ఇది కాంట్రవర్సీ అవుతుందని తెలిసినా కూడా మనసులో మాట చెబుతున్నానని చెప్పాడు విశ్వక్. తరుణ్ భాస్కర్ నీకు మాత్రమే చెప్తా షోకు వచ్చిన ఈయన చాలా విషయాలు చెప్పాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిన్ను బాగా ఇరిటేట్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే మరో మాట లేకుండా ఎఫ్ 2 అని చెప్పాడు విశ్వక్. ఆ సినిమాను చూస్తుంటే 15 నిమిషాలకే బయటికి వచ్చేసానని.. ఎందుకో అది అస్సలు కనెక్ట్ కాలేదని చెప్పాడు ఈ కుర్ర హీరో. తనకు నచ్చనంత మాత్రానా అందరికీ నచ్చకుండా ఉండక్కర్లేదని.. అది తనకు మాత్రమే నచ్చలేదని చెప్పాడు. కానీ తర్వాత చూస్తే ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలియదు కానీ ఎఫ్ 2 తనకు కనెక్ట్ కాలేదని చెప్పాడు విశ్వక్ సేన్. అందుకే థియేటర్ లో 15 నిమిషాలు కూడా కూర్చోలేదని చెప్పాడు ఈ కుర్ర హీరో. ఏదేమైనా కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమాను పట్టుకుని అలా చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. తనకు నచ్చనంత మాత్రానా అందరికీ నచ్చకుండా ఎందుకుంటుంది.. ఎవడి టేస్ట్ వాడికి ఉంటుందని చెప్పాడు విశ్వక్ సేన్.

More Related Stories