English   

భ‌ర‌త్ లో కొత్త ఫైట్ యాడ్ చేస్తున్నారు..

mahesh-ban
2018-04-25 16:53:45

నిడివి కోసం కొన్నిసార్లు సినిమా వాళ్లు మంచి సీన్స్ ను కూడా క‌ట్ చేస్తుంటారు. ఈ క‌టింగ్ కు ఎక్కువ‌గా బ‌ల‌య్యేది పాట‌లు, కామెడీ సీన్సే. కానీ అందుకు భిన్నంగా భ‌ర‌త్ అనేనేనులో ఓ మాంచి ఫైట్ ను ఆపేశారు. అప్ప‌టికే సినిమా దాదాపు మూడు గంట‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. దీంతో ఈ ఫైట్ ను తీసేశార‌ట‌. అయితే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో పాటు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. అందువల్ల ఇప్పుడా ఫైట్ ను కూడా యాడ్ చేయ‌బోతోంది టీమ్. ఇది హోలీ నేప‌థ్యంలోవ‌చ్చే ఫైట్ సీన్ అని ద‌ర్శ‌కుడు కొరటాల శివ చెప్పాడు. థియేట‌ర్ ఫైట్ లానే ఇది కూడా అదిరిపోతుంద‌ని ముందే హింట్ ఇచ్చాడు.

ఇక భ‌ర‌త్ అనేనేనుకు సంబంధించి మరో హైలెట్ న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ స‌క్సెస్ మీట్ ను వ‌చ్చే శుక్ర‌వారం తిరుప‌తిలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఇప్ప‌టికే సినిమా కేవ‌లం మూడు రోజుల్లోనే వంద కోట్లు సాధించిన నేప‌థ్యంలో ఈ స‌క్సెస్ టూర్ ఆ ఫిగ‌ర్ ను మ‌రింత పెంచుతుంద‌న‌డంలో డౌట్ లేదు. మ‌రోవైపు వ‌చ్చే శుక్ర‌వారం కూడా పెద్ద సినిమాలు, పెద్ద‌గా ప్ర‌భావం చూపే సినిమాలు లేవు కాబ‌ట్టి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య వ‌చ్చే వ‌ర‌కూ భ‌ర‌త్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంటాడ‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. అందుకోస‌మే ఈ కొత్త ఫైట్ ను కూడా యాడ్ చేయ‌బోతున్నారేమో.. ఏదేమైనా మ‌హేష్ మూడేళ్ల నిరీక్ష‌ణ‌కు భ‌ర‌త్ అనేనేను బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, మ‌హేష్ బాబు ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించుకుంటున్నారు.

More Related Stories