English   

 బ‌న్నీ కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్.. 

alluarjun-Joseph-Labisi
2018-04-18 14:29:04

అల్లుఅర్జున్ ఇమేజ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఈయ‌న సినిమాల‌కు క‌లెక్ష‌న్ల సునామీ కురుస్తుంది. దాంతో మేకింగ్ లో కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న నా పేరు సూర్య నా యిల్లు ఇండియా కోసం హాలీవుడ్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ జోసెఫ్ ల‌బిసిని తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చారు. ఈయ‌న ఇందులోని ల‌వ‌ర్ ఆల్‌సో.. ఫైట‌ర్ ఆల్‌సో పాట‌కు జొసెఫ్ ల‌బిసి సినిమాటోగ్రాఫ‌ర్ గా వ‌ర్క్ చేసారు. త‌న ప‌నిత‌నంఓ అమెరికాలోని అంద‌మైన విజువ‌ల్స్ ని బంధించారు. హాలీవుడ్ లో ది మూవీ హీరో.. ది రీపెర్స్ లాంటి సినిమాల‌కు ప‌నిచేసిన జోసెఫ్.. ఇప్పుడు పాప్ అల్బమ్స్ తో  బిజీగా ఉన్నారు. ఇలాంటి టాలెంటెడ్ ప‌ర్స‌న్ తొలిసారి ఓ ఇండియ‌న్ సినిమాకు.. అందులోనూ మ‌న తెలుగు సినిమా కోసం.. బ‌న్నీ నాపేరు సూర్యకి ప‌నిచేయ‌టం ఆనందంగా వుందంటున్నారు యూనిట్ స‌భ్యులు.  ఈ పాట కోసం 20 రోజులకి పైగా అమెరికాలోని హాలీవుడ్ ప్రాంతంలో లొకేష‌న్స్ వెతికారు. ఇందులో జోసెఫ్ అందించిన విజువల్స్ ప్రేక్షకుల ఆకట్టుకుంటాయి అంటున్నారు నిర్మ‌త ల‌గ‌డ‌పాటి శ్రీథ‌ర్. ఈ పాట కోసం హై ప్రోఫైల్ టెక్నిషియ‌న్ వ‌ర్క్ చేశారు. ప్ర‌ముఖ కాస్ట్యూమ్ డిజైన‌ర్ ఆన్‌ మెరీ హూంగ్ ఈ పాట‌కు క్యాస్ట్యూమ్ డిజైనింగ్ చేసారు. మొత్తానికి ఈ పాట కోసం హాలీవుడ్ ను ఇండియాకు.. మ‌న తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకొచ్చేసారు నా పేరు సూర్య నిర్మాత‌లు. 

More Related Stories