English   

క్యాన్సర్ ని జయించిన నటుడు...బ్యాక్ టు ఫాం

irrfankhan
2019-04-19 07:22:25

ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒకరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సైనికుడు సినిమాలో పప్పూ యాదవ్ గా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమయిన ఈయన బాలీవుడ్ లో కూడా తనదైన నటనా శైలితో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఆయన్ను దురదృష్టం వెంటాడింది, ఆయనకు అరుదైన ఒక క్యాన్సర్ సోకింది. న్యూరోఎండ్రోక్రైన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఇర్ఫాన్‌ఖాన్ ఈ మధ్యనే లండన్‌లో చికిత్స అనంతరం తిరిగొచ్చారు. అయితే ఆయన అభిమానులకి ఉస్తాహం కలిగించేలా ఆయన మళ్ళీ గతంలో లానే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. 2017లో వచ్చిన హిందీ మీడియం సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న అంగ్రేజి మీడియం సినిమాలో ఇర్ఫాన్ నటిస్తున్నాడు. డైరెక్టర్ హోమి అడ్ జానియాతో కలిసి ఇర్ఫాన్  సెట్స్‌లో నవ్వులు చిందిస్తూన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

More Related Stories