నాని లవ్ నవ్వితే నవరత్నాలే..!

నాని లవ్ ఎవరు అని కంగారు పడకండి..! రెండేళ్ల కింద కృష్ణగాడి వీర ప్రేమగాథతో ఇండస్ట్రీకి పరిచయం అయిన మెహ్రీన్ గుర్తుంది కదా. ఎన్ని సినిమాఉల చేసినా ఇప్పటికీ నాని లవర్ మహాలక్ష్మిగానే గుర్తుండిపోయింది ఈ ముద్దుగుమ్మ. కృష్ణగాడి వీర ప్రేమగాథ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని.. ఆ తర్వాత నెల రోజుల గ్యాప్ లోనే ఐదు సినిమాలతో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. రాజా ది గ్రేట్ తప్ప మరో హిట్ లేకపోయేసరికి మళ్లీ గ్యాప్ తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య పంతం.. దానికిముందు జవాన్ లాంటి సినిమాల్లో చాలా లావుగా కనిపించింది మెహ్రీన్. దాంతో బరువు తగ్గించి.. గ్లామర్ పెంచింది ఈ భామ. తాజాగా విడుదలైన పిక్స్ లో అమ్మడి నవ్వు చూస్తుంటే అబ్బో రాల్తాయేమో నవరత్నాలు అన్నట్లుంది. అంతగా మెరిసిపోతుంది ఈ భామ.
పంతం ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు మెహ్రీన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తోన్న ద్విభాషా చిత్రం నోటాలో ఈమె హీరోయిన్. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఎఫ్ 2లోనూ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తుంది ఈ భామ. హీరోయిన్లను రిపీట్ చేసే అలవాటు దిల్ రాజుకు బాగా ఉంది. ఓ సారి నచ్చితే వరసగా అవకాశాలిస్తుంటాడు రాజుగారు. ఇక అనిల్ రావిపూడి కూడా తన గత సినిమా హీరోయిన్లకు మళ్లీ మళ్లీ ఆఫర్లు ఇస్తుంటాడు. ఈ రెండు సినిమాలతో పాటు నితిన్-వెంకీ కుడుముల సినిమాలోనూ మెహ్రీన్ హీరోయిన్ గా నటించబోతుంది. మొత్తానికి ఈ సినిమాలతో మళ్లీ తన కెరీర్ గాడిన పడుతుందని భావిస్తుంది ఈ భామ.