English   

40ల్లో ఈ కోరికలేంటి పూజా..?

Hottest Actress Pooja Kumar Wants to Act in Telugu
2018-08-07 22:44:43

పూజాకుమార్.. ఈ పేరుతో ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదేమో..? ఒక్క‌సారి విశ్వ‌రూపం సినిమా గుర్తు చేసుకోండి.. అందులో క‌మ‌ల్ హాస‌న్ తో హాట్ గా న‌టించింది క‌దా ఆమెనే పూజాకుమార్. సెక్సీగా ఉంది క‌దా అని ఈమె వ‌య‌సు ఏ 25-30 మ‌ధ్య‌లో ఉంటుందేమో అనుకోకండి. అలా అనుకుంటే ప‌ప్పులో కాదు.. ఏకంగా ప‌ప్పు కుక్క‌ర్ లో కాలేసిన‌ట్లే. ఎందుకంటే అమ్మాయిగారి.. కాదుకాదు ఆంటీగారి వ‌య‌సు అక్ష‌రాలా 41. కానీ ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్ లాగే ఫీల్ అవ్వ‌డం ఈమె స్పెషాలిటీ. ఇప్పుడు కూడా త‌న కోసం స్టార్ హీరోలు అంతా క్యూ క‌డ‌తారేమో అనేంత‌గా ఎదురు చూపులు చూస్తుంది పూజాకుమార్.

టాలీవుడ్ లో త‌న‌కు అవ‌కాశాలు వ‌స్తాయేమో అని చూస్తుంది. విశ్వ‌రూపంతో పాటు క‌మ‌ల్ ఉత్త‌మ విల‌న్ లో కూడా ఈమెకు చాన్సిచ్చాడు. ఈ రెండు సినిమాల్లోనూ పూజాతో కెమిస్ట్రి అదిరిపోయింది. 60 దాటిన త‌ర్వాత కూడా పూజాతో రొమాన్స్ పండించాడు క‌మ‌ల్. వీళ్ల బంధం రోజురోజుకీ ఇంకా బ‌ల‌ప‌డిందే గానీ త‌గ్గ‌లేద‌నే వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు విశ్వ‌రూపం 2లో కూడా ఇద్ద‌రూ హాట్ రొమాన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఇలాంటి పోజులు చూపించి త‌న వ‌య‌సు 40 అనేది కూడా మ‌రిచిపోయి అవ‌కాశాల కోసం చూస్తుంది. అన్న‌ట్లు గ‌తేడాది రాజ‌శేఖ‌ర్ తో గ‌రుడ‌వేగ‌లో కూడా న‌టించింది ఈ ముదురు ముద్దుగుమ్మ‌. మ‌రి తెలుగు ఇండ‌స్ట్రీలో పూజాకుమార్ పూజ‌లు ఎంతవ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి..!

More Related Stories