English   

3 రోజుల్లో 500 కోట్లు ఎలా సాధ్యం..?

baahubali 2 the conclusion
2017-05-02 06:39:23

ఎలాంటి సినిమాల‌కైనా 500 కోట్ల మార్క్ అందుకోవ‌డం అనేది ఓ క‌ల‌. అంతెందుకు బాలీవుడ్ లో బాద్షాగా పిలుచుకునే షారుక్ ఖాన్ సైతం ఇప్ప‌టి వ‌ర‌కు 500 కోట్ల మార్క్ అందుకోలేక‌పోయాడు. అలాంటిది కేవ‌లం మూడంటే మూడే రోజుల్లో 500 కోట్ల మార్క్ అందుకుని అద్భుతం సృష్టించింది బాహుబ‌లి 2. అస‌లు ఈ సినిమాకు ఇంత‌లా క‌లెక్ష‌న్ల సునామీ ఎలా సాధ్య‌మైంది..? ఈ సినిమాలో అంత‌గా ఏముంది..? ద‌ర్శ‌క‌ధీరుడి అద్భుతాన్ని చూడ‌టానికి ప్రేక్ష‌కులు అంత‌గా ఎందుకు ఆస‌క్తి చూపించారు..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం సినిమాపై ప్రేక్ష‌కుల‌కు ఉన్న ఆస‌క్తి.. రాజ‌మౌళి త‌న సినిమా గురించి ప్రేక్ష‌కుల్లో పెంచిన అంచ‌నాలు..!

ఒక్క మీడియా ఛానెల్ కు కూడా రాజ‌మౌళి యాడ్స్ ఇవ్వ‌లేదు రాజ‌మౌళి. కేవ‌లం మీడియానే శివుడి విగ్ర‌హాన్ని ప్ర‌భాస్ మోసిన‌ట్లు. ఈ సినిమాను త‌ల‌పై మోసింది. తొలిరోజు ఈ సినిమాను చూడ‌క‌పోతే భూకంపం వ‌చ్చేస్తుందేమో అనేంత హైప్ క్రియేట్ అయిపోయింది. అదే ఇప్పుడు క‌లెక్ష‌న్ల రూపంలో క‌నిపిస్తుంది. వారం వ‌ర‌కు ఒక్క టికెట్ కూడా లేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. వీక్ డేస్.. వీకెండ్స్ అనే తేడా లేకుండా బాహుబ‌లి 2 దెబ్బ‌కు రికార్డుల‌న్ని బ‌ద్ద‌లైపోతున్నాయి. క‌చ్చితంగా మ‌రో మూడు నాలుగు రోజుల్లో బాహుబ‌లి 2 1000 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయం. ఈ మార్క్ దాటిన తొలి భార‌తీయ సినిమాగా కాల‌ర్ ఎగరేయ‌డం ఖాయం.

More Related Stories