English   

జన‌సేన‌కు అంత సీన్ ఉందా..? 

pawan-kalyan
2018-05-03 16:37:35

ప‌దేళ్ల కింద అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి అప్ప‌ట్లో అనుభవం లేక అన్నీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేసుకుంటూ వెళ్లిపోయాడు. దానికి తోడు ప‌క్కన కొంద‌రు చేరి మెగాస్టార్ ను ఎటూ కాకుండా చేసారు. మ‌రీ పార్టీని మూడేళ్లు కూడా న‌డ‌ప‌కుండా కాంగ్రెస్ లో క‌లిపేసాడు చిరు. ఇక ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం మొండిగా ముందుకెళ్తున్నాడు. జ‌న‌సేన వ‌చ్చి ఇప్ప‌టికే నాలుగేళ్లైంది. ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేయ‌లేదు. ఇప్పుడు అది కూడా చేస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో 175 స్థానాల‌కు పోటీ చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇదివ‌ర‌కు అడిగితే ఎక్క‌డ బ‌లం ఉందో అక్క‌డ మాత్ర‌మే చేస్తానన్నాడు ప‌వ‌న్. కానీ ఇప్పుడేమో అన్ని చోట్లా చేస్తానంటున్నాడు. అస‌లు సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ లేని జ‌న‌సేన‌.. క్యాడ‌ర్ ఎంతుందో కూడా తెలియ‌ని జ‌న‌సేన‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతారా..? ప‌వ‌న్ ఒక్క‌డే ఈ పార్టీని జ‌నాల్లోకి తీసుకెళ్లి విజ‌యం సాధిస్తాడా అనేది ఆస‌క్తి క‌లిగించే అంశం. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లుపెట్టినా ఇంకో ఏడాదిలో వ‌చ్చేస్తాయి ఎల‌క్ష‌న్స్. అయితే పార్టీలో క‌నీసం నాయ‌కులు కూడా లేరు. అలాంట‌ప్పుడు ఎవ‌ర్ని నిల‌బెడ‌తాడు.. ప్ర‌జ‌లు వాళ్ల‌ను ఎలా న‌మ్ముతారు..? ఇదే ఇప్పుడు అంద‌ర్లోనూ క‌నిపిస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి చూడాలిక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ స్టామినా ఎంతో..? 

More Related Stories