English   

30యేళ్ల ‘మెగాస్టార్ చిరంజీవి’...?

How Supreme Hero Chiranjeevi Become Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవికి 30యేళ్లేంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే.. ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే నలభైయేళ్లు కావొస్తోంది. ఇంకా ముప్ఫైయేళ్లేంటీ అని చాలామందికి అనిపించొచ్చు.కానీ మేటర్ ఉంది. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయి ఉండొచ్చు. కానీ చిరంజీవి మెగాస్టార్ అయ్యి మాత్రం 30యేళ్లే అవుతోంది. ఇంకా కన్ఫ్యూజన్ గా ఉందా..? వెరీ సింపుల్.. శవశంకర వర ప్రసాద్ గా ఇండస్ట్రీకి వచ్చి.. చిరంజీవిగా ఫేమస్ అయి స్టార్ గా ఎదిగిన నటుడు చిరంజీవి. అయితే మొదట్లో చిరంజీవి పేరు ముందు ఏ టైటిలూ ఉండేది కాదు. ఒట్టి చిరంజీవి అని తెరపై పడేది. ఆ తర్వాత డైనమిక్ హీరో అనే పేరు కొన్నాళ్లు పాటు ఉంది. ఆ తర్వాత సుప్రీమ్ హీరోగా చాలాకాలం హల్చల్ చేశాడు. అలాంటి సుప్రీమ్ హీరో ప్లేస్ లోకి మెగాస్టార్ అనే మాట చేరి నేటికి(05.08.18)30యేళ్లవుతోందన్నమాట. మరి దీని వెనక కథేంటో మనమూ తెలుసుకోవాలి కదా..

చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ రావడానికి నటవిరాట్ రావుగోపాలరావు కారణం. యస్.. ఆయనే చిరంజీవిని మొదటగా మెగాస్టార్ అన్న నటుడు. ఆ తర్వాత అందరికీ ఆయన చెప్పింది బాగా నచ్చింది. దీంతో అప్పటి నుంచి మెగాస్టార్ అన్నారు. కానీ సినిమాలో పడింది మొదటగా మరణమృదంగం సినిమాకు. యస్ ఈ సినిమా నుంచే చిరంజీవికి ముందు మెగాస్టార్ అన్న ట్యాగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా విడుదలైన తేదీ 05.08.1988. అంటే సరిగ్గా నేటికి 30యేళ్లు. అంటే అప్పుడు మొదలైన మెగా ప్రభంజనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. విశేషం ఏంటంటే అప్పట్లో చిరంజీవి ప్రతి సినిమాలోనూ కనిపించే రావుగోపాలరావు ఈ సినిమాలో లేరు. అలాగే ఇప్పుటి బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్ ఈసినిమాలో విలన్ గా నటించడం మరో విశేషం. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకుడు. మొత్తంగా మరణ మృదంగం కూడా అప్పట్లో మెగాస్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గా చేరింది.

More Related Stories