English   

బాలీవుడ్ విక్రమ్ వేదలో హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ 

Hrithik Roshan
2021-07-10 14:56:49

తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అవుతుందని వార్తలు వినిపించాయి. తెలుగు రీమేక్ గురించి అధికారిక ప్రకటన ఏది రాలేదు గానీ.. హిందీలో మాత్రం ‘విక్రమ్ వేద’ రీమేక్ త్వరలోనే మొదలు కాబోతుంది.   తాజాగా హిందీ రీమేక్‌కు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఒరిజిన‌ల్ సినిమాను తెర‌కెక్కించిన పుష్క‌ర్-గాయ‌త్రి హిందీ రీమేక్‌ని డైరెక్ట్ చేయ‌నుండగా ఇందులో హృతిక్ రోష‌న్, సైఫ్ అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. 2022 సెప్టెంబ‌ర్ 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More Related Stories