English   

భ‌ర‌త్ ప్రీమియ‌ర్స్ టార్గెట్ 2 మిలియ‌న్..

mahesh
2018-04-17 16:24:44

ఒక‌ప్పుడు ఓవ‌ర్సీస్ లో మిలియ‌న్ మార్క్ అందుకుంటే గొప్ప‌.. ఆ త‌ర్వాత 1.5 కి వ‌చ్చింది.. ఈ మ‌ధ్యే 2 మిలియ‌న్ కూడా చిన్న‌దైపోయింది. రంగ‌స్థ‌లం వ‌చ్చి 3.5 మిలియ‌న్ కూడా అందుకుంటుంది. దాంతో ఇప్పుడు పెద్ద సినిమాల‌కు 3 మిలియ‌న్ క‌నీసం టార్గెట్ అయిపోయింది. దాంతో ఇప్పుడు మ‌హేశ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న కొత్త సినిమా భ‌ర‌త్ అనే నేను ఓవ‌ర్సీస్ లో చిన్న‌సైజ్ అరాచాకాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని ఏకంగా 400 లొకేష‌న్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఇక 2000 ప్రీమియ‌ర్స్ షోలు వేస్తున్నారు. ఈ షోస్ తోనే ఏకంగా 2 మిలియ‌న్ లాగేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు. ఎప్రిల్ 19 రాత్రే 2 వేల షోస్ వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో ఇదే హైయ్య‌స్ట్ రికార్డ్. బాహుబ‌లి 2 కూడా ఇన్ని షోలు ప‌డ‌లేదు. ఒక‌వేళ సినిమాకు కానీ పాజిటివ్ టాక్ వ‌స్తే ఈజీగా 4 మిలియ‌న్ దాటేసి.. తెలుగు సినిమాకు స‌రికొత్త స్టాండ‌ర్డ్స్ ను సూప‌ర్ స్టార్ సెట్ చేస్తాడ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి చూడాలిక‌.. భ‌ర‌త్ అనే నేను ర‌చ్చ ఓవ‌ర్సీస్ లో ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories