English   

చిరంజీవితో సై అన్న బాలీవుడ్ బ్యూటీ

Huma-Qureshi
2018-06-26 16:03:39

మెగాస్టార్ చిరంజీవి సరసన ఛాన్స్ వస్తే కాదనేదెవరు..? ఏళ్లు మీదపడుతోన్న ఆయన ఛరిష్మాలో ఛేంజ్ ఏం లేదని రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150తో మళ్లీ ప్రూవ్ అయింది. బాక్సాఫీస్ వద్దా బాస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరిగింది. గ్యాప్ వచ్చినా.. గ్రేస్ తగ్గలేదు.. మాస్ లుక్ మారలేదు. అది మెగాస్టార్ చిరంజీవి అంటే. ఆయన ఫ్యామిలీలోనే కాదు.. టాలీవుడ్ లో ఎందరు స్టార్స్ ఉన్నా.. మళ్లీ మెగా టైమ్ మొదలైందనే అనుకోవాలి. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నాడు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడిగా చెప్పుకునే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఇది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ గెస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా చేస్తోంది. తమన్నా కూడా ఓ కీలక పాత్రలో కినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో బ్యూటీకి ఛాన్స్ ఉంది. ఆ బ్యూటీని బాలీవుడ్ నుంచి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. 

రీసెంట్ గా కాలా సినిమాలో సూపర్ స్టార్ లవర్ గా మెప్పించిన హుమా ఖురేషీ మెగాస్టార్ తో సై అనేసిందనే టాక్ వినిపిస్తోంది. సైరాలో హుమా ఖురేషీది ఓ కీలక పాత్ర అని చెబుతున్నారు. చబ్బీ బ్యూటీగా బాలీవుడ్ లో మంచి పేరున్నా.. అమ్మడికి అక్కడ పెద్ద బ్రేక్ రాలేదు. కానీ హుమాకు చాలామంది అభిమానులున్నారు. ఆమె పర్సనాలిటీని ఇష్టపడే ఫ్యాన్స్ అధికం. మొత్తంగా ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతుందనే వార్తలు ఇంకా సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా కన్ఫార్మ్ కాకపోయినా.. తను ఈ సినిమాలో నటించబోతోందనేది మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. 

సైరా రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోనే యాక్షన్ ఎపిసోడ్స్  చిత్రీకరణ జరుపుకుంటోంది. రామ్ చరణ్ నిర్మిస్తోన్న సైరాకు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ కాకపోవడం విశేషం. 

More Related Stories