English   

క‌ణంలో నేను న‌టించ‌లేద‌న్న సాయిప‌ల్ల‌వి..

sai pallavi

అదేంటి.. మీకేమైనా పిచ్చా.. క‌ణంలో సాయిప‌ల్ల‌వి న‌టించ‌క‌పోవ‌డం ఏంటి..? త‌నే క‌దా యాక్ట్ చేసింది.. పోస్ట‌ర్లు ట్రైల‌ర్లు కూడా విడుద‌ల‌య్యాయి క‌దా ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్న‌ది అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. ఈ సినిమాలో తాను న‌టించ‌లేదు.. ద‌ర్శ‌కుడు విజ‌య్ న‌న్న‌స‌లు న‌టించ‌నివ్వ‌లేదంటోంది సాయిప‌ల్ల‌వి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇది తల్లి, కూతురికి ఉండే భావోద్వేగాల మ‌ధ్య న‌డిచే క‌థ‌. విజయ్‌ ఈ కథ చెప్పిన‌పుడు ముందు ఒక్క క్ష‌ణం ఆలోచించుకున్నాన‌ని చెప్పింది ప‌ల్ల‌వి. ఎందుకంటే త‌ల్లి పాత్ర కాబ‌ట్టి తాను చేయ‌గ‌ల‌నా లేదా అనే అనుమానం అయితే వ‌చ్చింది త‌న‌కు అనేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిప‌ల్ల‌వి చేసిన పాత్ర‌ల‌న్నీ యూత్ ఫుల్ రోల్సే. అంతా కుర్రాళ్ల గుండెల్ని మాయ చేసాయి. ఫిదా.. ఎంసిఏ లాంటి తెలుగు సినిమాల‌తో ఇక్క‌డ స్టార్ అయిపోయింది ప‌ల్ల‌వి. అందుకే ఇందులో త‌న కూతురిగా కనిపించే వెరోనికాతో ముందు చాలా సమయం గడిపాన‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి.

అలా చేయ‌డం వ‌ల్లే ఇద్ద‌రం నిజంగానే త‌ల్లీ కూతుళ్ల‌లా క‌లిసిపోయామ‌ని చెబుతుంది ప‌ల్ల‌వి. తల్లి-కూతురి సెంటిమెంట్ కాబ‌ట్టి టిపిక‌ల్ సినిమాటిక్ అమ్మాయి మాదిరే కాస్త ఎక్కువ ఎమోష‌న్ పండిద్దాం అనుకునే దాన్న‌ని.. కానీ ద‌ర్శ‌కుడు విజ‌య్ వ‌చ్చి అంత లౌడ్ వ‌ద్దు ఇది చాలు అనేవాళ్ల‌ని.. అలా ఎందుకు అనేవాళ్లో డ‌బ్బింగ్ చెబుతున్న‌పుడు అర్థం అయింద‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి. విజ‌య్ అలా చెబుతున్న‌పుడే అస‌లు మీకు న‌టించ‌నివ్వ‌ట్లేదు.. అనేసి న‌వ్వాన‌ని చెప్పింది ప‌ల్ల‌వి. క‌ణం సినిమా మాత్రం త‌ను చాలా ఇష్ట‌ప‌డి చేసిన పాత్ర అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. మార్చ్ 5న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. దీనికి సాయిప‌ల్ల‌వి వ‌స్తుందా రాదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే అప్ప‌ట్లో హీరో నాగ‌శౌర్య ఈమెపై కొన్ని క‌మెంట్స్ చేసాడు క‌దా.. మ‌రి క‌ణం సినిమాను తెలుగులో ప్ర‌మోట్ చేస్తుందో చేయ‌దో అనే ఆస‌క్తి అయితే అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది.

More Related Stories