English   

నితిన్ ఎప్పటికీ పెళ్లి చేసుకోడట

Nithiin-marriage
2018-06-21 10:16:08

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్స్ లో నితిన్ ఒకడు. కంటిన్యూస్ గా సినిమాలైతే చేస్తున్నాడు.. పెళ్లి మేటర్ మాత్రం ఎప్పుడూ దాటేస్తుంటాడు. ఇప్పుడతను మంచి పెళ్లీడులో ఉన్నాడు. అయినా పెళ్లంటే అప్పుడేనా అంటుంటాడు. అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్ గా అతను ఆ విషయం తేల్చేశాడు. తను ఎప్పటికీ భారతంలో భీష్ముడులా ఉంటాడట. అంటే పెళ్లి చేసుకోడు అన్నమాట. బట్ ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లోనే... యస్.. నితిన్ నెక్ట్స్ మూవీకి ఇలాంటి టైటిలే పెట్టేశారు.. ‘భీష్మ’ అని. సింగిల్ ఫరెవర్ అనేది ఉపశీర్షిక. కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ గా ఉంటుందీ మూవీ. అలాగే వెంకీ మార్క్ పంచ్ లు కూడా ఉంటాయని టాక్. 

ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట కొట్టిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా ఉంటుంది. నిజానికి వెంకీ కుడుములకు చాలా పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే ముందుగా అతను సితారా బ్యానర్ లో కమిట్ అయ్యాడు. ఈ బ్యానర్ లో అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కూడా చాలా తర్జనభర్జనలు జరిగాయి. దీంతో ఆ దర్శకుడికి ఎవరూ ఆఫర్ ఇవ్వలేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి. బట్ ఫైనల్ గా మంచి స్వింగ్ లో ఉన్న నితిన్ తో ఛాన్స్ కొట్టేసి బంపర్ ఆఫర్ కొట్టేశాడనే అనుకోవాలి. ఇక సితారా ఎంటర్టైనర్మెంట్స్ బ్యానర్ లో సినిమా అంటే ఆల్మోస్ట్ హిట్ అనేది ఆడియన్స్ కూ తెలుసు. నితిన్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచిన అ ఆ హారిక హాసినిలో వస్తే ఇప్పుడు సితారలో చాన్స్ వచ్చింది. 

ఇక మరో విశేషం ఏంటంటే.. వెంకీ కుడుముల త్రివిక్రమ్ శిష్యుడు. గురువుగారు హారిక హాసినిలో ఫిక్స్ అయితే శిష్యుడు ఆ బ్యానర్ కే చెందిన సితారలో ఫిక్స్ అవుతాడేమో. ప్రస్తుతం నితిన్ శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు పూర్తి కావొచ్చింది. ఇక ఈ భీష్మ.. సింగిల్ ఫరెవర్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

More Related Stories