English   

సారీ చెప్పను బ్రదర్..రజనీ క్లారిటీ

rajni
2020-01-21 18:43:54

ఈ మధ్య ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌పై రజినీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మొన్న 14న జరిగిన తుగ్లక్‌ పత్రిక 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న రజనీ పెరియార్‌ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీలో పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించిన క్రమంలో ఈ వివాదం రేగింది. పెరియార్‌ ర్యాలీ గురించి ఒక్క తమిళ మేగజైన్‌ మాత్రం ఈ వార్తను ప్రచురించిందని ప్రభుత్వం కావాలనే ఈ వార్త బయటకు రాకుండా జాగ్రత్త పడిందని రజనీ ఆరోజున అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలపై కళగం నేతలు మండిపడ్డారు. పెరియార్‌పై, ఆయన నిర్వహించిన కార్యక్రమాలపై రజనీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసు కేసులు నమోదు చెశారు. రజనీకాంత్‌ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కళగం నేతలు డిమాండ్‌ చేశారు. అయితే తాజాగా ఈ విషయం మీద స్పందించిన రజనీకాంత్‌.. ఎవరెన్ని కేసులు పెట్టినా నేను సారీ చెప్పను. నేనేమీ కల్పించి మాట్లాడలేదు. మీడియాలో ఏం రాశారో వాటి గురించే మాట్లాడాను. కావాలంటే ఆధారాలు చూపిస్తాను’ అని అన్నారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో ఏమో చూడాలి ?

 

More Related Stories