English   

బ్లాక్ లేక‌పోతే బాహుబ‌లి 2 ప‌రిస్థితేంటి..?

baahubali 2 block tickets danda
2017-05-01 14:38:23

ఒక్క రోజులో 200 కోట్ల గ్రాస్.. మూడు రోజుల్లో 500 కోట్లు.. అస‌లు ఇవి ఓ ఇండియ‌న్ సినిమా ఊహించిన వ‌సూళ్లేనా..? ఏదైనా హాలీవుడ్ సినిమాల‌కు వ‌చ్చిన వ‌సూళ్లా..? మ‌న బాహుబ‌లి 2 ఇప్పుడు ఇవ‌న్నీ నిజం చేసి చూపించింది. ఇంత గొప్ప సినిమాకు ఇన్నేసి వంద‌ల కోట్లు రావ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. కానీ నిజంగా ఇవ‌న్నీ జెన్యూన్ గా వ‌చ్చిన వ‌సూళ్లేనా..? అంటే స‌మాధానం మాత్రం చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. ఎందుకంటే బాహుబ‌లి 2కు ఇష్ట‌మొచ్చిన‌ట్లు బ్లాక్ మార్కెట్ దందా న‌డుస్తుంది. అది కూడా అఫీషియ‌ల్ గా..! ఒక్కో టికెట్ కు దాదాపు 500 రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నాయి మ‌ల్టీప్లెక్సులు. టికెట్ తో పాటు ఇంట‌ర్వెల్ ఫుడ్ కూడా కొనాల్సిందే అని కొన్ని మ‌ల్టీప్లెక్సుల కండీష‌న్. ఇక సింగిల్ స్క్రీన్స్ లో అయితే టికెట్లు ఇవ్వ‌డ‌మే మానేసారు. అంతా బ్లాక్ దందానే..!

పైగా ప్ర‌భుత్వాలు కూడా బాహుబ‌లి 2కు వ‌త్తాసు ప‌లికాయి. తెలంగాణ‌లో 5 షోలు.. ఆంధ్రాలో 6 షోలు అంటూ ప‌ర్మిష‌న్లు ఇచ్చేసాయి. ఇది కూడా వ‌సూళ్ళ‌ను పెంచేసింది. పైగా 9000 థియేట‌ర్స్ అంటే మాట‌లు కాదు. ఆల్ మోస్ట్ ఇండియాలో ఉన్న 90 శాతం థియేట‌ర్స్ లో బాహుబ‌లి 2 విడుద‌లైంది. ప్ర‌తీ సినిమాకు ఇన్ని వ‌స‌తులు ఇవ్వ‌రు. బాహుబ‌లి 2 స్పెష‌ల్ సినిమా కాబ‌ట్టి ఇచ్చారు. అయితే నిజంగా అన్ని సినిమాల మాదిరే బాహుబ‌లి కూడా విడుద‌లైతే ఎన్ని కోట్లు వ‌సూలు చేస్తుంది..? ఇప్పుడు మూడు రోజుల్లో 500 కోట్లు వ‌చ్చాయి. ఈ ఫెసిలిటీస్ ఏవీ లేకుండా విడుద‌లైతే 3 రోజుల్లో 200 కోట్లైనా జెన్యూన్ గా బాహుబ‌లి 2 వ‌సూలు చేస్తుందా..? ఇదేదో బాహుబ‌లి గొప్ప‌త‌నాన్ని త‌క్కువ చేయ‌డానికి కాదు.. మిగిలిన సినిమాల‌తో పోలిస్తే బాహుబ‌లి ఎన్ని లాభాలు పొందిందో చెప్ప‌డానికి మాత్ర‌మే..!

More Related Stories