English   

ఆ హీరోలు కామాంధులంటోన్న ఇల్లీబేబ్.. 

Ileana-D-cruz
2018-03-14 13:51:04

ఈ మ‌ధ్య ఇలియానా బాగా ఓపెన్ అయిపోతుంది. ఆ ఏముందిలే ఇంత‌కంటే ఏముంది ఈ లోకంలో అనుకుంటుందో ఏమో గానీ.. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తుంది. తాజాగా మ‌రోసారి త‌న నోటి దురుసు చూపించింది ఈ గోవాబ్యూటీ. తాజాగా రైడ్ సినిమా ప్ర‌మోష‌న్ కు వ‌చ్చిన ఇలియానా బాలీవుడ్ హీరోల‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు క‌మెంట్ చేసింది. మార్చ్ 16న రైడ్ విడుద‌ల కానుంది. అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్ర ప్ర‌మోష‌న్ ఇప్పుడు ఇలియానా పీక మీదుకు తీసుకొచ్చింది. హిందీలో చాలా మంది హీరోల‌కు అమ్మాయిల‌తో ఎలా మాట్లాడాలో తెలియ‌దని.. ఇక్క‌డ చాన్స్ రావాలంటే ప‌డుకోడానికి రావాలంటూ ఓపెన్ గానే హీరోలు అడుగ‌తార‌ని.. త‌న‌ను కూడా అలా అడిగార‌ని చెప్పింది ఇలియానా. క్యాస్టింగ్ కౌచ్ నార్త్ ఇండ‌స్ట్రీలో మ‌రీ ఎక్కువైపోయింద‌ని చెప్పింది ఈ గోవాబ్యూటీ. 

బాలీవుడ్ హీరోలు కామాంధులు అనే పెద్ద ప‌దం వాడేసింది ఇలియానా. ఆ హీరోల గురించి బ‌య‌ట‌పెడితే ఇక్క‌డ హీరోయిన్ల కెరీర్ లు క్లోజ్ అయిపో తాయ‌ని.. అందుకే తాను కూడా ఈ పేర్ల‌ను బ‌య‌ట పెట్ట‌డం లేదంటూ సంచ‌ల‌నం సృష్టించింది ఇలియానా. ఈమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు హిందీ హీరోల అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎక్క‌డో సౌత్ లో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఇక్క‌డ అవ‌కాశాలిస్తే నువ్వు మా హీరోలపై ఈ ర‌క‌మైన క‌మెంట్స్ చేస్తావా అంటూ అభిమానులు ఇలియానాపై ఫైర్ అవుతున్నారు. సౌత్ ద‌ర్శ‌కుల‌కు అమ్మాయిల‌ను చూపించ‌డం రాదు.. వాళ్ల దృష్టి ఎప్పుడూ న‌డుముపై.. అందాల‌పైనే ఉంటుంద‌ని ఈ మ‌ధ్యే ద‌క్షిణాది ఇండ‌స్ట్రీపై కూడా సంచ‌ల‌న క‌మెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ వేడి ఇంకా చ‌ల్లార‌క‌ముందే ఇప్పుడు బాలీవుడ్ హీరోల‌పై నోరు పారేసుకుంది ఇలియానా. 

ప‌నిలో ప‌నిగా మీకు అవ‌కాశాలు ఎందుకు రావ‌ట్లేదు.. ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(అవ‌కాశాల కోసం ప‌డుకోవ‌డం) ఉందా అని అడిగిన ప్ర‌శ్న‌కు నేరుగా ఉంది అని ఆన్స‌ర్ ఇచ్చింది ఇల్లీబేబీ. అక్క‌డితో ఆగ‌కుండా.. మిగిలిన హీరోయిన్లలా తాను అవ‌కాశాల కోసం హీరోలు, ద‌ర్శ‌కులు బెడ్రూమ్ కు వెళ్లలేద‌ని.. సెక్స్ చేయ‌లేద‌ని.. వ‌చ్చిన సినిమాలు మాత్రమే సినిమాలు చేస్తున్నాన‌ని చెప్పింది. అవ‌కాశాలు లేవా అనే ప్ర‌శ్న‌కు ఉందో లేదో అనే స‌మాధానం చెప్ప‌కుండా ప‌క్క హీరోయిన్ల సెక్స్ ముచ్చ‌ట్లు ఎందుకు చెప్పిన‌ట్లో..? ఆ మ‌ధ్య బాత్రూమ్ ఫోటోలు.. ఆ త‌ర్వాత బెడ్రూమ్ లో మాట్లాడుకోలేని విధంగా చెప్పిన మాట‌లు.. ఇవ‌న్నీ చెప్పింది ఇలియానానే క‌దా.. ప‌క్క హీరోయిన్లు కాదు. మొత్తానికి త‌న కింద న‌లుపు చూసు కోకుండా ప‌క్క వాళ్లను వేలెత్తి చూపించ‌డానికి బ‌య‌ల్దేరింది ఈ గోవాబ్యూటీ. 

More Related Stories