English   

ఇలియానాకు పాపం లాక్‌డౌన్‌లో ఆ ఒక్కటి మిస్ అయిందంట..

actress
2020-05-21 08:01:37

లాక్‌డౌన్ అందరికీ కష్టాలు తీసుకొచ్చింది. ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్లు కూడా ఇంట్లోనే లాక్ అయిపోయారు. సినిమా వాళ్లకు కూడా ఇది మినహాయింపు కాదు. ఇప్పుడు ఇలియానా కూడా తన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ఇలియానాకు ఇప్పుడు కష్ట కాలం నడుస్తుంది  ఎంత చూపించినా ఎంత చేసినా కూడా ఈమెకు కాలం కలిసి రావడం లేదు  దానికి తోడు తెలుగులో 2012లో జులాయి తర్వాత 2018 లో ఆరేళ్ల గ్యాప్ తీసుకుని ఈమె నటించిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా డిజాస్టర్ అయిపోయింది ఈ సినిమా తర్వాత దర్శక నిర్మాతలు ఆమె వైపు చూడటం మానేశారు దానికి తోడు భరించలేనంతగా బ‌రువు పెరిగిపోయింది. ఒక‌ప్పుడు న‌డుము మాత్రమే క‌నిపించేది కానీ ఇప్పుడు ఫ్యాట్ అండ్ సెక్సీగా ఒళ్లంతా సెగలు పుట్టిస్తుంది. రెండేళ్ల కింద బాద్ షాహోలో ఏకంగా న్యూడ్ గా న‌టించింది ఇలియానా. ఓ స‌న్నివేశం కోసం అజ‌య్ దేవ్ గ‌న్ ముందు న్యూడ్ గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌.

పైగా సినిమాలో ముద్దులు.. హాట్ సీన్ల‌తో రెచ్చిపోయింది ఈ జ‌ఘ‌న సుంద‌రి. ఇంత చేసినా కూడా అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. తెలుగులోనూ ఇదే ప‌రిస్థితి. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ్లాప్ త‌ర్వాత ఇలియానా వైపు చూడ్డానికి కూడా ఆలోచిస్తున్నారు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు. పైగా ఇప్పుడు ఏ హీరో కూడా ఇలియానాతో న‌టించ‌డానికి ఉత్సాహం చూపించ‌డం లేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చిందనే వార్తలొచ్చినా అది కూడా అబద్ధమే. ఈ మధ్యే స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు ట్రై చేస్తోంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ కారణంగా తాను బీచ్ లైఫ్ మిస్ అయిపోయానని చెబుతుంది ఇలియానా. చిన్నప్పటి నుంచి బీచ్ లైఫ్‌కు బాగా అలవాటు పడిన తాను ఇప్పుడు ఒక్కసారిగా లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే ఉండిపోయానని.. దాంతో ఆ లైప్ బాగా మిస్ అయిపోయానని చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటీ.

 

More Related Stories