English   

ఫిజిలో ఇలియానా బిజీ..

Ileana-fiji-Islands
2018-08-07 14:50:37

అవ‌కాశాలు లేవ‌నే మాటే గానీ కెరీర్ ను మాత్రం త‌న‌కు కావాల్సిన‌ట్లు సూప‌ర్ గా ఎంజాయ్ చేస్తోంది ఇలియానా. అస‌లు ఎప్పుడు ఎలా త‌న కెరీర్ ను త‌న‌కు కావాల్సిన‌ట్లు మార్చుకోవాలో ఈ భామ‌కు ఫుల్ క్లారిటీ ఉంది. సినిమాలు వ‌స్తే చేస్తుంది లేదంటే హాయిగా ఫోటోషూట్లు చేసుకుంటుంది. అవ‌కాశాలు రావ‌ట్లేదు రావ‌ట్లేదు అని ఏడ్చేకంటే వ‌చ్చిన అవ‌కాశాలు ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసుండాలి. ఈ విష‌యంలో ఇలియానా పిహెచ్డీ కాదు దాని అమ్మమ్మ‌నే పూర్తిచేసింది. అమ్మ‌డుకు బాలీవుడ్ లో కూడా అర‌కొర అవ‌కాశాలే వ‌స్తున్నాయి. రైడ్.. రుస్తోం.. బాద్ షాహీ లాంటి సినిమాలు వ‌చ్చినా కూడా ఇప్పుడు పెద్ద‌గా ఆఫ‌ర్లు అయితే లేవు. అవ‌కాశాల కోసం వేచి చూస్తూనే.. మ‌రోవైపు బికినీ ఫోటోషూట్లు, చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో అందాల ఆర‌బోత‌లు చేస్తుంది గోవాబ్యూటీ. 

ప్ర‌స్తుతం షూటింగ్ లు ఏవీ లేక‌పోవ‌డంతో హాయిగా తన స్నేహితుల‌తో క‌లిసి ఫిజిలో ఎంజాయ్ చేస్తుంది ఇల్లీబేబీ. ఖాళీ టైమ్ దొరికేస‌రికి హాయిగా స‌ముద్రం మ‌ధ్య‌లో చ‌ల్ల‌గాలి మ‌ధ్య పోజులిచ్చింది ఈ జ‌ఘ‌న సుంద‌రి. ఈ మ‌ధ్య కాస్త ఒళ్లు కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ ఫోటోల‌ను పోస్ట్ చేసింది ఇలియానా. మొన్న‌టికి మొన్న‌ మొహం క‌న‌బ‌డ‌కుండా కేవలం అందాల్ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ ఇల్లీబేబీ ఇచ్చిన పోజుకు కుర్రాళ్ళ గుండెలు జారిపోయాయి. ఇక అంద‌మైన ఫిజి దీవికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయింది ఇలియానా. అక్క‌డ అందాల మ‌ధ్య బికినీలో క‌వ్విస్తుంది ఈ గోవా బ్యూటీ. చాలా ఏళ్ళ త‌ర్వాత తెలుగులో ర‌వితేజ స‌ర‌స‌న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో న‌టిస్తుంది ఇల్లీబేబీ. ఇందులో షూటింగ్ పూర్తి కావ‌డంతో హాయిగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. 

More Related Stories