English   

భరించలేనంత బరువు పెరిగిపోయిన ఇలియానా..

Ileana DCruz
2020-02-22 14:58:09

ఇలియానా అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది నడుము.. ఆ మడతలో పడి ఎంతో మంది కుర్రాళ్లు చచ్చిపోయారు. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని దుమ్ము దులిపేసింది ఇలియానా. ఈ గోవా బ్యూటీ ఒంపులకు పడిపోయిన వారు లేరు. అంతగా మాయ చేసిన ఇలియానా ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది. బాలీవుడ్లో అవకాశం వచ్చిందని తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూసింది. ఆరేళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆ మధ్య అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఫిజిక్ లో కూడా చాలా తేడాలు వచ్చాయి. 

ఇప్పుడు ఇలియానాను చూస్తుంటే అసలు ఒకప్పుడు మనం చూసిన గోవా బ్యూటీ ఈమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. అంతగా బరువు పెరిగిపోయి చూడటానికి కూడా ఎబ్బెట్టుగా మారిపోయింది ఇలియానా. ముందు నుంచి ఇలియానాకు గుర్తింపు తీసుకొచ్చిన నడుము.. ఇప్పుడు మరీ దారుణంగా మారిపోయింది. ఆమెను ప్రస్తుత ఫోటోలు చూస్తుంటే వామ్మో ఏంటి సైజు అని భయపడక తప్పదు. ప్రస్తుతానికి సినిమాలపై పూర్తిగా దృష్టి తగ్గించి పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ఇలియానా. ఈమె తీరు చూస్తుంటే ఇక తెలుగు సినిమాలకు కూడా గుడ్ బై చెప్పినట్లు అర్థమైపోతుంది. 

బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత సినిమాల పై ఫోకస్ చేసింది ఇలియానా. కానీ ఫిజిక్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఆమె ఎంత కష్టపడినా ఇంతకుముందు ఉన్న లుక్ రావడం లేదు. దాంతో ఇలియానను ఇలా చూసిన ప్రతిసారి అభిమానులకు బాధ తప్పడం లేదు. ఇప్పుడు కూడా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కూడా చాలా బొద్దుగా కనిపిస్తోంది. ఇంకెప్పుడు మారిపోతావ్ ఇల్లీ బేబీ అంటూ ఆమెను అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
 

More Related Stories