English   

ఇలియానా.. బాగా కండ ప‌ట్టింద‌బ్బా..!

Iliyana
2018-06-14 08:06:24

సౌత్ లో ఉన్న‌పుడు ఒంటిపై కేజీ కండ కూడా లేన‌ట్లుగా ఉండేది ఇలియానా. స్కెల్ట‌న్ మాదిరి ఉంటూ.. న‌డుము అందాల‌తో చంపేసింది గోవాబ్యూటీ ఇక బాలీవుడ్ కు వెళ్లిన త‌ర్వాత మాత్రం కాస్త ఒళ్లు చేసింది. అక్క‌డ ఇంకాస్త డోస్ పెంచేసి అందాలు ఆర‌బోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు మ‌రోసారి కూడా బికినీలో ర‌చ్చ చేసింది ఈ భామ‌. తాజాగా మ‌రోసారి బికినీలో రెచ్చిపోయింది ఇలియానా. బికినీ టాప్ లో అలా ప‌డుకుని ఇల్లీబేబీ ఇచ్చిన పోజ్ చూసి అంద‌రికీ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ప్ర‌స్తుతం ఈ భామ ర‌వితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది ఇలియానా. ద‌క్షిణాదిన  ఉన్న‌పుడు ఎలా ఉండేదో ఇప్పుడు మ‌రోసారి అదే రాణివాసం ఇస్తున్నారు. శీనువైట్ల అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కోసం ఇలియానాకు ఏకంగా 2 కోట్లు ఇచ్చి తీసుకొస్తున్నారు. 

ఇన్నాళ్లూ టాలీవుడ్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోని ఇలియానా.. ఇప్పుడు ఫోటోషూట్ల‌తో త‌న ఆగ‌మ‌నాన్ని చాటుతుంది. వ‌స్తున్నా చూసుకోండి అన్న‌ట్లు కొత్త ఫోటోల‌తో సంద‌డి చేస్తుంది. బాలీవుడ్ లో ఎంత రెచ్చిపోయినా ఒక్క ఆఫ‌ర్ కూడా రావ‌డం లేదు. గ‌త ఏడాది బాద్ షాహోలో ఏకంగా న్యూడ్ గా న‌టించింది ఇలియానా. ఓ స‌న్నివేశం కోసం అజ‌య్ దేవ్ గ‌న్ ముందు న్యూడ్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా సినిమాలో ముద్దులు.. హాట్ సీన్ల‌తో రెచ్చిపోయింది ఈ జ‌ఘ‌న సుంద‌రి. ఇంత చేసినా కూడా అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దాంతో చేసేదేం లేక‌.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. చివ‌ర‌గా ర‌వితేజ దేవుడు చేసిన మ‌నుషులుతో తెలుగుకు బైబై చెప్పిన ఇలియానా.. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న సినిమాతోనే వ‌స్తుంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి కిక్.. ఖ‌త‌ర్నాక్.. దేవుడు చేసిన మ‌నుషులు సినిమాల్లో న‌టించారు. మ‌రి ఇన్నేళ్ల త‌ర్వాత తెలుగులోకి వ‌స్తే గోవాబ్యూటీని ఇక్క‌డి ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలిక‌..!              

More Related Stories