English   

బాబోయ్.. నయనతారను ఆపేదెవరు..?

ImaikkaaNodigal-Tamil

లేడీ సూపర్ స్టార్ గా తిరగులేని క్రేజ్ తెచ్చుకున్న నయనతరా స్పీడ్ కు బ్రేకులే లేవు. నయన్ సినిమా అంటే ఇప్పుడు కోలీవుడ్ లో ఓ స్టార్ హీరో రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తున్నాయి. పైగా అవన్నీ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్. ఇలాంటి ఇమేజ్ ఈ మధ్య కాలంలో తను మాత్రమే సంపాదించుకోగలిగిందంటే అతిశయోక్తి కాదు. మరోవైపు వరుసగా సినిమాలూ చేస్తోంది. ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ ఓ మీడియం రేంజ్ స్టార్ హీరో తీసుకునేంత. అయినా ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారంటే తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డిలో హీరోయిన్ గా నటిస్తోన్న యన్ లేటెస్ట్ గా మరో హీరోయిన్ సెంట్రిక్ తమిళ్ సినిమాతో రాబోతోందీ. 

ఇమైక్క నానోడిగళ్.. ఇదీ నయన్ లేటెస్ట్ మూవీ. ఇవాళ(27.06.18) ట్రైలర్ విడుదలైంది. సైకోటిక్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ సినిమాలో మరో సెన్షేషన్ ఏంటంటే.. విలన్ గా నటించింది బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. మనోడు కూడా సైకో గా తెగ భయపెట్టేశాడు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అధర్వ మురళి, రాశిఖన్నా మరో జంటగా కనిపించారు.. 

ప్రతి మనిషీ ఏదో ఒకదాన్ని ప్రేమిస్తాడు. అలా తను చంపడాన్ని ప్రేమిస్తానంటూ అనురాగ్ చెప్పే డైలాగ్స్ కూ చేసే పనులకు జంకు పుడుతుందంటే నమ్మాల్సిందే. అలాంటి ఓ సైకో కిల్లర్ ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా మన కర్తవ్యం బ్యూటీ నయనతార కనిపిస్తుంది. అతన్ని పట్టుకుంటుందా లేదా అనేది ఊహించేదే అయినా.. ఊహించని రేంజ్ లో దర్శకుడు విజయ్ సేతుపతిని ట్రైలర్లోనే ఎంటర్ చేసి షాక్ ఇచ్చాడు. మరవైపు అధర్వ మురళిని కూడా అనురాగ్ కిడ్నాప్ చేస్తాడు. అతను నయన్ కు బంధవు.. మొత్తంగా వెరీ ఇంట్రెస్టింగ్ సాగిన ఈ ట్రైలర్ చాలా స్పీడ్ గా టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోతోంది. ఏదేమైనా నయనతార స్పీడ్ ను ఆపేవారెవరూ ఇప్పట్లో కనిపించేలా లేరు.. ఎనీ వే బెస్ట్ ఆఫ్ లక్ నయన్.. 

More Related Stories