English   

చైతూ ఉన్నాడంటున్న ఇంద్ర‌గంటి..

indraganti mohan krishna with nag chaithanya
2018-06-09 08:10:38

ఇన్నాళ్లూ సైలెంట్ గా చిన్న సినిమాల‌తో కాలం గ‌డిపిన ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ‌.. ఇప్పుడు రూట్ మార్చిన‌ట్లుగా అనిపిస్తుంది. ఈయ‌న నుంచి కూడా ఇక‌పై భారీ సినిమాలు వ‌చ్చేలా ఉన్నాయి. రెండేళ్ల కింద నానితో జెంటిల్ మెన్ చేసిన ఈ ద‌ర్శ‌కుడు.. మ‌ళ్లీ అమీతుమీతో చిన్న ద‌ర్శ‌కుడు అయిపోయాడు. ఇక ఇప్పుడు సుధీర్ బాబుతో స‌మ్మోహ‌నం అంటూ కాస్త పెద్ద సినిమానే చేసాడు. జూన్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ట్రైల‌ర్ చూస్తుంటే క‌చ్చితంగా ఇది కూడా హిట్ మాల్ అని అర్థ‌మైపోతుంది. పైగా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూను కూడా ఇందులో ట‌చ్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది విడుద‌ల కాక‌ముందే త‌ర్వాతి సినిమా నాగ‌చైత‌న్య‌తో అని చెప్పేసాడు ఇంద్ర‌గంటి. నిజానికి స‌మ్మోహ‌నం కంటే ముందే ఈ ద‌ర్శ‌కుడితో చైతూ సినిమా చేయాలి కానీ అప్పుడు స‌వ్య‌సాచితో పాటు మారుతి సినిమాకు కూడా క‌మిట్ మెంట్ ఉండ‌టంతో ఇంద్ర‌గంటికి డేట్స్ ఇవ్వ‌లేక‌పోయాడు ఈ హీరో. దాంతో ఇప్పుడు చేస్తానంటున్నాడు మోహ‌న‌కృష్ణ‌. సెన్సిబుల్ సినిమాలు తీయ‌డంలో ఆరితేరిపోయిన ఇంద్ర‌గంటికి నాగ‌చైత‌న్య లాంటి క్రేజీ హీరో ప‌డితే మార్కెట్ రేంజ్ కూడా పెరిగిపోతుంది. చూడాలిక‌.. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఎలాంటి సినిమా చేయ‌బోతున్నారో..? 

More Related Stories