English   

దిల్ రాజుకు ఇన్నాళ్లకు తెలిసిందా

dil-raju
2018-07-12 14:56:50

టాలెంట్ ఎక్కడున్నా వెంటనే గ్రాబ్ చేస్తాడు.. ఇదీ దిల్ రాజుకు ఉన్న పేరు. కానీ ఎందుకో ఇంద్రగంటి మోహనకృష్ణ విషయంలో ఆయన ఈ మాటను పాటించలేదు. ఇందుకు చాలా టైమ్ పట్టింది. అయితేనేం లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో డబుల్ మూవీ స్టార్ట్ కాబోతోంది. డబుల్ అంటే రెండు సినిమాలు కాదు.. ఇద్దరు హీరోల సినిమా. అంటే మల్టీస్టారర్. యస్.. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా అఫీషియల్ గానే అనౌన్స్ అయింది. అయితే ఆ మల్టీస్టారర్ లోనటించే ఆ హీరోలెవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.  మోహనకృష్ణ ఇంద్రగంటి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. జెంటిల్మన్, అమీతుమీతో పాటు లేటెస్ట్ గా వచ్చిన సమ్మోహనం సినిమాలు బాక్సాఫీస్ తో పాటు శాటిలైట్ పరంగానూ మంచి బిజనెస్ చేశాయి. పైగా మోహనకృష్ణ సినిమాలు మాగ్జిమం తెలుగుదనం నిండి ఉంటాయి. తెలుగు ఆర్టిస్టులనే తీసుకుంటాడు. మేకింగ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. అదే ఆడియన్స లో అతనికంటూ సెపరేట్ ఆడియన్స్ ను తెచ్చింది. మొత్తంగా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి ఈ దర్శకుడుకి ఇంత టైమ్ పట్టింది అనుకునే కంటే అతన్ని గుర్తించడానికి దిల్ రాజుకు ఇన్నాళ్లు పట్టిందా అనిపిస్తుంది.. మరి ఈ కాంబోలో వచ్చే ఆ సినిమా దిల్ రాజు శైలిలో ఉంటుందా.. లేక మోహనకృష్ణ స్టైల్లో ఉంటుందా అనేది చూడాలి. 

More Related Stories