English   

పుష్ప సినిమా టీజర్ టాక్ 

pushpa
2021-04-08 16:39:51

అల్లు అర్జున్ అభిమానులు పుష్ప సినిమా కోసం ఎలా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ నుంచి అల వైకుంఠపురములో.. సుకుమార్ నుంచి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి కూడా అలాగే ఉంది. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఈ పుట్టినరోజుకు బన్నీ ఫాన్స్‌కి ఇంతకంటే బెటర్ గిఫ్ట్ మరొకటి ఉండదు.

పుష్ప సినిమా మొదలైన తర్వాత తొలిసారి రష్మిక మందనను ఈ టీజర్‌లో పరిచయం చేశాడు సుకుమార్. టీజర్ అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ చేయడం.. వాళ్లను పట్టుకోడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ వెంట పడటం.. మధ్యలో వాటిని అల్లు తీసుకెళ్లడంతో చాలా అద్భుతంగా కట్ చేసారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అదిరిపోయింది. టీజర్‌కు పిచ్చెక్కిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆగస్ట్ 13న ఈ చిత్రం విడుదల కానుంది.

More Related Stories