English   

ఐపిఎల్ మొద‌లైంది.. ద‌డ షురూ అయింది.. 

IPL-tollywood
2018-04-09 16:26:08

ఇండియాలో ఉన్న‌వి రెండే రెండు మ‌తాలు. ఒక‌టి క్రికెట్.. రెండు సినిమా. ఈ రెండూ క‌లిస్తే కాంబినేష‌న్ సూప‌ర్ హిట్. కానీ ఈ రెండు పోటీ ప‌డితే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లే. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఇప్పుడు మొద‌లైంది. రోజురోజుకీ ఐపిఎల్ ఊపందుకుంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్ప‌ట్నుంచీ మ‌రో 45 రోజుల పాటు ఐపిఎల్ సంద‌డితో హోరెత్తిపోనున్నాయి స్టేడియ‌మ్స్. క‌చ్చితంగా ప్ర‌తీ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. దాంతో ఇప్పుడు నిర్మాత‌ల‌కు గుబులు మొద‌లైంది. ఐపిఎల్ త‌మ సినిమా వ‌సూళ్ల‌పై ఎక్క‌డ ప్ర‌భావం చూపిస్తుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు నిర్మాత‌లు. ఒక్క‌టి రెండు కాదు.. ఏకంగా నెల‌న్న‌ర పాటు సాగ‌నుంది ఈ భారీ క్రికెట్ టోర్న‌మెంట్. పైగా రానురాను ఇంకా రంజుగా మార‌బోతుంది ఐపిఎల్. ఇలాంటి టైమ్ లో ముఖ్యంగా ఫ‌స్ట్ అండ్ సెకండ్ షోల‌కు క‌లెక్ష‌న్లు త‌గ్గే ప్ర‌మాదం కూడా ఉంది. గ‌తంలోనూ ఐపిఎల్ పుణ్య‌మా అని కొన్ని సినిమాల‌కు వ‌సూళ్లు రాలేదు. ఇప్పుడు కూడా చాలా సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.. మ‌రి ఈ సారి ఐపిఎల్ పోటీ నుంచి మ‌న సినిమాలెలా త‌ట్టుకుంటాయో చూడాలిక‌..!

More Related Stories