English   

5 నిమిషాల డ్యాన్స్ కు 15కోట్లా..?

IPL-Opening
2018-03-27 14:05:43

డిమాండ్ ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలన్స్ చక్కబెట్టుకోవాలంటారు. ఈ విషయం బాలీవుడ్ స్టార్స్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ప్రస్తుతం బాలీవుడ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటోన్న వారిలో రణ్ వీర్ సింగ్ ఒకడు. వరుస విజయాలు రాకపోయినా వరుస ప్రశంసలతో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా పద్మావత్ సినిమా అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో ఉగ్రరూపంతో అద్దరగొట్టాడు. ఈ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా రణ్ వీర్ కు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇదే కాదు.. అతను ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతుండటాడు. అదే రణ్ వీర్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ తెచ్చింది. ఆ క్రేజ్ నే క్యాష్ చేసుబోతోంది ఐపిఎల్ సీజన్ 11. 

ఏప్రిల్ 7నుంచి ఐపియల్ సీజన్11 ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ ను ప్రారంభించడానికి బాలీవుడ్ తారలను రంగంలోకి దించి హల్ చల్ చేయడం ఐపియల్ సాధారణం. అలా ఈ సారి నిర్వాహకులు రణ్ వీర్ ను సంప్రదించారు. కేవలం ఐదు నిమిషాల ప్రదర్శనకు అతను ఏకంగా 15కోట్లు అడిగాడు. అందుకు నిర్వాహకులు ఒప్పుకోవడం విశేషం. కేవలం ఐదు నిమిషాల ప్రదర్శనకు 15కోట్లు అనేది మామూలు రేంజ్ కాదు. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. జోయాఅక్తర్ దర్శకత్వంలో గల్లీభాయ్ అనే సినిమా చేస్తున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ 2019ఫిబ్రవర్ 14 వేలైంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నారు. దీనితో పాటు తెలుగులో హిట్ అయిన టెంపర్ రీమేక్ సింబాలోనూ నటిస్తున్నాడు. 

More Related Stories