English   

‘పుష్ప: ది రైజ్’ లో భన్వర్ సింగ్ షెకావత్ IPS గా ఫహాద్ ఫాజిల్

fahadh-faassil as ips officer in the allu arjun sukumars pushpa
2021-08-28 22:30:16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా ‘పుష్ప’ వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. భన్వార్ సింగ్ షెకావత్ IPSగా ఫ‌హాద్ ఫాజిల్ ‘పుష్ప: ది రైజ్‌’ లో కనిపించబోతున్నారు. తాజాగా ఈయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఫహాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానుల ఆద‌ర‌ణ దక్కించుకున్నాయి.

తాజాగా విడుదలైన ఈయన ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈయన బర్త్ డే పోస్టర్‌లో EVIL WAS NEVER SO DANGEROUS అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్ కూడా అలాగే ఉంది. దీన్ని బట్టి ఫహాద్ పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమవుతుంది. గుండుతో ఉన్న ఫహాద్ ఫాజిల్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల కానుంది.
 

More Related Stories