English   

 ప్రాణాంత‌క వ్యాధితో ఇర్ఫాన్ ఖాన్ పోరాటం.. 

Irrfan- Khan- Health

ఎవ‌రికైనా మ‌ర‌ణం అనేది చాలా పెద్ద స‌మ‌స్య‌. భ‌యం కూడా. మ‌నం ఉండగా అది రాదు.. అది వ‌చ్చాక మ‌నం ఉండం. కానీ ఎప్పుడు వ‌స్తుందో ముందే తెలిస్తే మాత్రం దానికంటే న‌ర‌కం మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఇలాంటి జీవన్మ‌ర‌ణ స‌మ‌స్యే వ‌చ్చి ప‌డింది. ఈయ‌న ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మే. తెలుగులో ఈయ‌న సైనికుడు సినిమాలో న‌టించాడు. ఇందులో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు ఇర్ఫాన్. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ఎన్నో మ‌రుపురాని సినిమాలు చేసాడు. పాన్ సింగ్ తోమ‌ర్ లాంటి సినిమాల్లో న‌టించి జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. 

హాలీవుడ్ లోనూ ఈయ‌న ప్ర‌యాణం సాగింది. అక్క‌డ జురాసిక్ వ‌ర‌ల్డ్ లో న‌టించాడు ఇర్ఫాన్. ఇలాంటి అద్భుత‌మైన న‌టుడికి ఇప్పుడు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. ఈయ‌నకు వ‌చ్చిన వ్యాధి ఏంట‌నేది ఇప్పుటికీ డాక్ట‌ర్లు క్లారిటీగా చెప్ప‌లేక‌పోతున్నారు. రోజురోజుకీ ఈయ‌న ఆరోగ్యం క్షీణిస్తుంద‌ని తెలుస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఈయ‌న‌కు సన్నిహితులు.. స‌హ‌చ‌ర న‌టుడు.. స్నేహితులు అండగా నిల‌బ‌డుతున్నారు. ఈయ‌న అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు అంటూ ఇర్ఫాన్ భార్య సుతాప చెప్పింది. ఈ వ్యాధితో ఆయ‌న పోరాడుతున్నాడ‌ని.. దేవుడే ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాడ‌ని చెబుతుంది ఈమె. 

నా ప్రియ స్నేహితుడు.. నా జీవిత భాగస్వామి గొప్ప పోరాట యోధుడు అంటూ ఇర్ఫాన్ కు ధైర్యం చెబుతుంది సుతాప‌. తన జీవిత ప్రయాణంలో అడ్డంకిగా నిలిచిన మహమ్మారిపై అద్భుతమైన మనోధైర్యంతో పోరాటం సాగిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మనం భగవంతుడిని కోరడం తప్ప మ‌రోటి లేదని సుతాప ట్వీట్ చేసారు. ఇదంతా చూస్తుంటే ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. త్వ‌ర‌లోనే ఈయ‌న అమెరికా వెళ్ల‌నున్నారు. అక్క‌డే మెరుగైన చికిత్స తీసుకో బోతున్నారు. ఇలాంటి విల‌క్ష‌ణ న‌టుడికి ఇంత‌టి అరుదైన వ్యాధి సోక‌డం నిజంగా శోచ‌నీయం. ఎలాగైనా ఈయ‌న ఆరోగ్యం బాగుప‌డాల‌ని ఆ దేవున్ని మ‌నం కూడా కోరుకుందాం..! ఇప్పుడు అంతకంటే మ‌నం కూడా చేసేదేం లేదు. 

More Related Stories