English   

దిల్ రాజును దించేస్తోన్న అల్లు అర‌వింద్.. 

Allu-Aravind
2018-08-17 13:53:04

అంతే ఇండ‌స్ట్రీలో ఇలాగే ఉండాలి మ‌రి..! న‌చ్చితే ఫాలో అయిపోవాలి.. ప‌నికొస్తుందంటే కాపీ కొట్టేయాలి. ఇదే చేస్తున్నాడిప్పుడు అల్లు అర‌వింద్. ఈయ‌న ఓ విష‌యంలో ఇప్పుడు సీరియ‌స్ గా దిల్ రాజును ఫాలో అవుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది నిర్మాత‌లు చేసిందే.. ఈ మ‌ధ్య దిల్ రాజు ఈ సూత్రాన్ని ఎక్కువ‌గా ఫాలో అవుతున్నాడు. అదే ద‌ర్శ‌కుల్ని హోల్డ్ చేయ‌డం. ఒక్క హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కున్ని అంత ఈజీగా వ‌దిలేయ‌డం దిల్ రాజుకు అస్స‌లు న‌చ్చ‌దు. క‌నీసం రెండు మూడు సినిమాలు చేయిస్తుంటాడు. ఇప్పుడు అల్లు అర‌వింద్ కూడా ఇదే చేస్తున్నాడు. గీత‌గోవిందంతో త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ను ఇప్పుడు మ‌రో సినిమాకు లాక్ చేసుకుంటున్నాడు ఈ నిర్మాత‌. ఇప్ప‌టికే శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో ఈయ‌న హిట్ ఇచ్చాడు. ఇప్పుడు వ‌ర‌సగా రెండో విజ‌యాన్ని కూడ అందించాడు గీతాఆర్ట్స్ కు. దాంతో మూడోసారి కూడా గీతాఆర్ట్స్ 2కు సినిమా క‌మిట‌య్యేలా చేస్తున్నాడు అల్లు అరవింద్. ఈ సారి ఏకంగా అల్లుఅర్జున్ సినిమానే ఈ ద‌ర్శ‌కుడికి ఇచ్చేలా క‌నిపిస్తున్నాడు మెగా నిర్మాత‌. అయితే ప‌రుశురామ్ మాత్రం మంచు విష్ణుతో సినిమా క‌మిట‌య్యాడనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ ఇద్ద‌రిలో ఈయ‌న ఎవ‌రి సినిమా చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories