English   

రాజ‌మౌళి రాజ‌యోగం ముగిసిందా..?

Is-baahubali-Going-To-Be-Last-Superhit-In-Rajamouli-s-Career
2017-05-05 02:48:06

రాజ‌మౌళి.. ఈ పేరు ఇప్పుడు ఇండియాలో బ్రాండ్. ఈయ‌న పేరు క‌నిపిస్తే చాలు వంద‌ల కోట్లు వ‌చ్చేస్తున్నాయి. ఈ స్టేజ్ కు రావ‌డానికి రాజ‌మౌళి ఒక్క రోజు ప‌డిన కృషి కాదు. కొన్నేళ్ల శ్ర‌మ దాని వెన‌క దాగుంది. ఆయ‌నకు సినిమా అంటే ప్రాణం అనే మాట చాలా త‌క్కువ‌. అంత‌గా ప్రేమిస్తాడు ఆయ‌న ఓ సినిమాను. య‌జ్ఞంలా మొద‌లుపెట్టి.. దాన్ని పూర్తి చేసే వ‌ర‌కు అదే ధ్యాస‌లో ఉంటాడు రాజ‌మౌళి. సినిమాను అంత అద్భుతంగా చెక్కుతాడు కాబ‌ట్టే ఆయ‌న్ని జ‌క్క‌న్న కూడా అంటారు. అయితే ఇవ‌న్నీ రాజ‌మౌళికి రాజ‌యోగం న‌డుస్తుంది కాబ‌ట్టే జరిగాయా.. ఇప్పుడు జ్యోతిష్కులు లేవ‌నెత్తిన కొత్త అనుమానం ఇది. రాజ‌మౌళి క‌ష్టాన్ని త‌క్కువ చేయ‌డం కాదు కానీ ఆయ‌న క‌ష్టానికి జాత‌కం కూడా బాగా క‌లిసొచ్చిందంటున్నారు వాళ్ళు.

రాజ‌మౌళి న‌క్ష‌త్రం పూర్వాభాద్ర మూడోపాదం కుంభ రాశీ. ఈ రాశీ వాళ్ల‌కు గ‌త కొన్నేళ్లుగా రాజ‌యోగం న‌డుస్తోంది. ఒకవేళ బాహుబ‌లి సినిమాను వేరే ఏ ద‌ర్శ‌కుడు తీసినా ఇంత‌గా ఆడేది కాదంటున్నారు వాళ్లు. సినిమాకు కాస్త అటూ ఇటూగా టాక్ వినిపించినా స‌రే.. రాజ‌మౌళి జాత‌క బ‌లంతోనే ఈ స్థాయి విజ‌యం అందుకుందంటున్నారు. ఈ రాజ‌యోగం వ‌ల్లే ఎలాంటి సినిమా చేసినా సంచ‌ల‌నం సృష్టించింద‌నీ.. ఇలాంటి వాళ్ల‌కు ఓ ల‌క్ష్యం నిర్దేశిస్తే సుల‌భంగా అందుకుంటార‌ని చెబుతున్నారు వాళ్లు. అయితే రాజమౌళి రాజ‌యోగం మే 2తో పూర్తైంద‌ని చెబుతున్నారు జ్యోతిష్కులు. మే 2 త‌ర్వాత ఈయ‌న జాత‌కంలో కేతు మ‌హ‌ర్ద‌శ మొద‌లు కానుంది.

దీనివ‌ల్ల ఏడేళ్లు క‌ష్టాలుంటాయ‌ని చెబుతున్నారు. బాహుబ‌లి నుంచి వ‌చ్చిన పేరు ప్ర‌తిష్ట‌లు కూడా మ‌స‌క‌బారే ప్ర‌మాదం లేక‌పోలేదు అంటున్నారు జ్యోతిష్కులు. ఏమో మ‌రి చూడాలిక‌.. ఇన్నాళ్లూ త‌న క‌ష్టాన్ని న‌మ్ముకుని పైకి ఎదిగిన రాజ‌మౌళిని జాత‌కం ఎలా మార్చ‌నుందో..?

More Related Stories