English   

మ‌హాన‌టి అంతా అబ‌ద్ధమా..?

is it true story of mahanti
2018-06-02 08:43:43

మ‌హాన‌టి అద్భుత‌మైన సినిమా.. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఏ ద‌ర్శ‌కుడు చేయ‌లేని సాహ‌సం 30 ఏళ్లు కూడా నిండ‌ని నాగ్ అశ్విన్ చేసాడు. త‌న‌కు తెలిసిన దాంట్లో సావిత్రి జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రించాడు. అదిప్పుడు సంచ‌ల‌న విజ‌యం కూడా సాధించింది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రంలో చాలా త‌ప్పులు ఉన్నాయ‌ని.. అస‌లు సావిత్రి జీవితంలో జ‌రిగిన చాలా సంఘ‌ట‌న‌ల‌ను ఈ చిత్రంలో చూపించ‌లేదని సావిత్రితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నవాళ్లు చెబుతున్నారు. ఇక అంతేకాదు.. సావిత్రి జీవితంలో అస‌లు విల‌న్ త‌న కూతురు విజ‌య చాముండేశ్వ‌రి.. ఆయ‌న భ‌ర్తే అని స్వ‌యానా సావిత్రి మేన కోడ‌లే చెబుతుంది. ఇదే ఇప్పుడు అస‌లు సంచ‌ల‌నం. 

సావిత్రి బ‌తికి ఉన్న‌పుడు ఆమెను నానా హింస‌లు పెట్టి.. ఇంట్లోకి కూడా రానివ్వ‌కుండా ఆస్తులు అన్నీ లాక్కొని ఆమెపై కోర్ట్ కేస్ వేసింది నువ్వు కాదా అంటూ విజ‌య చాముండేశ్వ‌రిని నిల‌దీసింది ఆమె బంధువు. దాంతోపాటు సావిత్రి ఉన్న‌పుడు ఏ ఒక్క‌రు కూడా ఆమెను ప‌ట్టించుకోలేద‌ని.. ఇప్పుడేమో సినిమాలో విజ‌య త‌న‌కు కావాల్సింది మాత్ర‌మే ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కు చెప్పింద‌ని ఆరోపిస్తుంది ఆమె. 

ఇక అప్ప‌ట్లో సావిత్రిని క‌ళ్ళారా చూసిన వాళ్లు కూడా చాలా మంది మ‌హాన‌టిపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. సినిమా అద్భుతంగా ఉంది.. సావిత్రి జవితాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు అంటూనే.. ఇంకొన్ని అంశాలు మిస్ అయిపోయాయంటున్నారు. ముఖ్యంగా 1979లో రాజ‌బాబు త‌న ప‌రిస్థితే బాగోలేని స‌మ‌యంలో సావిత్రికి స‌న్మానం చేసాడు. 

ఆ త‌ర్వాత జివికే శాస్త్రి అనే మ‌రో వ్య‌క్తి కూడా మ‌హాన‌టిని స‌న్మానించాడు. ఆ స‌భ‌లోనే పాపం సావిత్రి త‌న మ‌న‌సులోని బాధను అప్ప‌టి మీడియాతో ప్ర‌జ‌ల‌తో పంచుకున్నార‌ని సీనియ‌ర్ జ‌ర్నలిస్టులు చెబుతున్నారు. ఆ వేడుక‌లో సావిత్రి మాట్లాడిన మాట‌లు ఆమె బాధ‌ను తెలియ‌జేస్తాయంటున్నారు. మ‌హాన‌టి మ‌హాన‌టి అంటున్నారు.. ఆ మ‌హాన‌టికి వేశాలివ్వ‌రా.. అందుకు ప‌నికిరాదా అంటూ ఇండ‌స్ట్రీని ప్ర‌శ్నించిందట ఆ స‌భ‌లో సావిత్రి..! ఇక అదే స‌భ‌లో దేవ‌త అంటూ త‌న‌ను పొడుగుతున్నార‌ని అందుకే ఊరు పొలిమేర వ‌ర‌కు త‌రిమేశారు.. క‌నీసం దేవ‌త‌ను ఏడాదికి ఒక్క‌సారైనా చూసి చీర‌, బొట్టు ఇస్తారు.. త‌న‌కు అవి కూడా అవ‌స‌రం లేదు కాసింత ప‌ల‌క‌రిస్తే చాలు అంటూ ఆవేద‌న‌తో సావిత్రి మాట్లాడిన మాట‌లు అప్ప‌ట్లో అంద‌ర్నీ కంట‌త‌డి పెట్టించాయ‌ని చెబుతున్నారు. 

ఇవ‌న్నీ సినిమాలో చూపించి ఉంటే బాగుండేదంటున్నారు. అంతేకాదు సావిత్రి వైభ‌వాన్ని కూడా సినిమాలో స‌రిగ్గా చూపించ‌లేద‌ని.. ఆమె బెడ్ రూమ్ లో ఎటు చూసినా 360 డిగ్రీల్లో జెమిని గ‌ణేష‌న్ ఫోటోలే ఉండేవ‌ని.. అప్ప‌ట్లో ఆయ‌న్ని ఆమె అంత‌గా ప్రేమించింద‌ని చెబుతున్నారు సావిత్రి గురించి తెలిసిన వాళ్లు. పైగా ఆమె జీవితంలో జెమిని ఎప్పుడూ విల‌న్ కాద‌ని.. కొన్ని ప‌రిస్థితుల దృష్ట్యా సావిత్రికి అత‌డు విల‌న్ గా మారాడ‌ని చెబుతున్నారు. సావిత్రికి మందు అల‌వాటు కావ‌డానికి అస‌లు కారకుడు ఒక‌ప్ప‌టి త‌మిళ టాప్ క‌మెడియ‌న్ చంద్ర‌బాబు అని.. ఆయ‌న వ‌ల్లే సావిత్రి తాగుడుకు బానిస అయింది కానీ జెమిని వ‌ల్ల కాదు. అయితే సావిత్రి అంత‌గా తాగుతుంటే ఆపే అవ‌కాశం ఉండి కూడా ఆప‌క‌పోవ‌డం మాత్రం జెమినీ చేసిన త‌ప్పే. 

ఇవ‌న్నీ సినిమాలో క‌నిపించ‌లేదు. చివ‌ర్లో ఆమె కోమాలోకి వెళ్లేముందు తాగి పోయింద‌ని చూపించారు. కానీ సావిత్రి తాగ‌లేద‌ని.. మైసూర్ షూటింగ్ కు వెళ్లిన‌పుడు ఒంట్లో శ‌క్తిలేక ఇన్సూలిన్ వేసుకున్న‌పుడు దానికి తాల‌లేక కోమాలోకి వెళ్లింద‌ని సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ చెబుతున్నారు. అంతేకాదు.. సావిత్రి చ‌నిపోయే ముందు ఆస్తులు చాలా ఉన్నా కూడా ఎవ‌ర్నీ అడ‌గ‌లేక స్వాభిమానంతో నిరుపేద‌గా చ‌నిపోయింద‌ని గుర్తు చేస్తున్నారు ఆమె గురించి తెలిసిన‌వాళ్లు. అయితే ఏదేమైనా సినిమాతో ఓ మంచి ప్ర‌య‌త్నం అయితే జ‌రిగింది.. ఇక‌పై కూడా ఇలాంటి సినిమాలు రావాల‌ని కోరుకుంటున్నారు వాళ్లు. 

More Related Stories