English   

మహేష్ బాబు పేదవాడంటే నమ్ముతారా..?

Is Mahesh Babu poor?
2018-06-08 20:46:40

చూడగానే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ లా కనిపించే మహేష్ బాబు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా..? నమ్ముతారు.. అంటున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అతని దర్శకత్వంలో మహేష్ బాబు 25వ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆల్రెడీ ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీకి ఫస్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరగబోతోంది. పూజా హెగ్డే మహేష్ సరసన నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అతను మహేష్ బాబుకు బెస్ట్ ఫ్రెండ్ గా కనిపిస్తాడు. పాత్ర మరీ పెద్దదేం కాకపోయినా చాలా ప్రాధాన్యం ఉన్నదే అంటున్నారు. అయితే ఇది కృష్ణుడు-కుచేలుడి పాత్రల ఆధారంగా అల్లుకున్న కథ అనేది చాలా రోజులుగా వినిపిస్తోన్న మాట.  ఈ నేపథ్యంలో చాలామంది నరేష్ పేదవాడు.. మహేష్ అతన్ని ఆదుకుంటుంటాడు అనుకున్నారు. బట్ అది నిజం కాదట.

మహేష్ బాబే పేదవాడి పాత్ర చేస్తున్నాడు. నరేష్ మల్టీ మిలియనీర్ గా కనిపిస్తాడని అంటున్నారు. అంతస్తుల పరంగా చాలా వ్యత్యాసం ఉన్నఈ ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది. మహేష్ కే సాయం చేసేంత పరిస్థితి నరేష్ కు ఎలా వచ్చింది. అనేది కీలకంగా కనిపించే అంశాలుగా ఉంటాయని టాక్.

కానీ అసలు నరేష్.. మహేష్ బాబుకు హెల్ప్ చేస్తాడనే కాన్సెప్ట్ కు అభిమానులు జీర్ణించుకుంటారా..? ఇంకా చెబితే మహేష్ బాబును పేదవాడు పాత్రలో చూస్తారా..? పేదవాడు అంటే కేవలం ధనం పరంగానేనా లేక బంధుగణం పరంగానా అనే డౌట్స్  కూడా ఉన్నాయీ సినిమాలో. బట్.. ఇదీ కథ అని ఇదమిద్ధంగా ఇంతవరకూ ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదు కాబట్టి.. అప్పటి వరకూ మహేష్ ను గురించిన ఇలాంటి మసాలా రూమర్స్ తో లాగించడమే.. 

More Related Stories