English   

బాలయ్య సరసన హనీ పాప ?

Balakrishna
2019-05-22 17:42:37

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికల జాబితాలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్', ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో తన ఖాతాలో భారీ హిట్ ను జమ చేసుకుంది. ఈ సినిమా తరువాత ఆమె చాలా బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ మెహ్రీన్ మాత్రం తనకి నచ్చిన పాత్రలను మాత్రమే ఓకే చేస్తూ వెళుతోంది. తమిళ దర్శకుడు తిరు- గోపిచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికయిన ఆమె. ఈ సినిమానే కాదు నందమూరి బాలకృష్ణ – కెయస్ రవి కుమార్ కాంబినేషన్ లో పట్టాలెక్కబోతున్న కొత్త సినిమాలో ఎంపికయ్యిందని అంటున్నారు. ఆమె ఓకే చెప్పాల్సి ఉండదని అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బాలయ్య మెహ్రీన్ లు స్క్రీన్ మీద రోమాన్స్ చేయనున్నారని అంటున్నారు. నిజానికి ఇప్పటి పరిస్థితుల్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం కష్టంగా మారింది. దీంతో నిర్మాతలు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ ఇలా ఫేడవుట్ అవుతున్న హీరోయిన్స్ ని పట్టుకుంటున్నారు.

More Related Stories