English   

ప్రభాస్ బిజెపిలో జాయిన్ అయ్యాడా..?

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజకీయాల్లోకి వెళుతున్నాడా..? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపి పార్టీకి ప్రచారం చేయబోతున్నాడా అంటే అవుననే వినిపిస్తోంది. ప్రభాస్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. బిజెపికి ఓటేయమని తన అభిమానులకు సందేశం ఇచ్చే అవకాశాలున్నాయనుకోవచ్చు. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్ లేటెస్ట్ గా పెదనాన్న కృష్ణం రాజుతో కలిసి జాతీయ హోమ్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ కలయిక మర్యాదపూర్వకంగా జరిగింది కాదు. కావాలనే ఇద్దరూ వెళ్లి ఆయన్ని కలిసి శాలువాతో సత్కరించారు.

ఇక కృష్ణంరాజు ముందు నుంచీ బిజెపీలో ఉన్నారు. మధ్యలో పార్టీ మారినా మళ్లీ బిజెపిలోకే వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణంరాజు బిజెపి నుంచి అసెంబ్లీ కానీ, పార్లమెంట్ సీట్ కానీ ఆశిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కలయిక ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్ ను వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయమని కోరినట్టు సమాచారం. ప్రచారానికి ఒప్పుకుంటే ప్రభాస్ కు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా ఇస్తామని చెప్పినట్టు టాక్. ఇందుకు ప్రభాస్ కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ప్రభాస్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతాడని వేరే చెప్పక్కర్లేదేమో.. 

More Related Stories