English   

రాజ‌మౌళి క‌ర‌ణ్ అర్జున్ రీమేక్ చేస్తున్నాడా ఏంటి..? 

RRR
2019-02-11 10:24:24

రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు అంచ‌నాల‌తో పాటు ఆస‌క్తి కూడా ఉంటుంది. ఆయనేం చేస్తున్నాడో.. ఏం చేయ‌బోతున్నాడో.. మ‌ళ్లీ ఈ సారి ఏం అద్భుతం చేస్తాడో అని ఎవ‌రికి వాళ్లు సొంతంగా బుర్ర‌ల‌కు ప‌ని చెబుతుంటారు. ఇక క‌థ విష‌యంలో కూడా రాజ‌మౌళి సినిమాపై చాలా విష‌యాలే వినిపిస్తున్నాయి. ఈ చిత్ర క‌థ‌పై ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు చెబుతూనే ఉన్నారు. ఒలంపిక్ నేప‌థ్యంలో అని ఓ సారి.. కాదు బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ అని మ‌రోసారి.. ఇలా ఎవ‌రికి వాళ్లు సొంత స్టోరీలు అల్లేస్తున్నారు. ఇక ఇప్పుడు బ్రిటీష్ కాలం నాటి క‌థ‌తో ఇది తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన సెట్ల నిర్మాణం ఆర్ఎఫ్ సీతో పాటు అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఆర్ఎఫ్సీలోనే షూటింగ్ జ‌రుగుతంది. 

బ్రిటీష్ కాలాని సంబంధించిన సెట్లు చూసిన త‌ర్వాతే ఇది అక్క‌డి క‌థ అని క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటున్నారు విశ్లేష‌కులు. మ‌రోసారి క‌చ్చితంగా విజువ‌ల్ వండ‌ర్ చేస్తున్నాడు రాజ‌మౌళి. పైగా ఎన్టీఆర్, చ‌ర‌ణ్ లాంటి సూప‌ర్ స్టార్స్ అంటే ఆ క‌థ ఎలా ఉంటుందో ఊహ‌కు కూడా అంద‌డం లేదు. 1920 నాటి క‌థ‌తో ఇది తెర‌కెక్కుతుంది. స్వాతంత్ర్యం ముందు జ‌రిగిన క‌థే ఇది. అయితే అక్క‌డి క‌థ‌తో ఇప్పుడు జ‌రిగే క‌థ‌కు లింక్ పెడుతూ సాగే స్టోరీ ఇది. మ‌గ‌ధీర త‌ర‌హాలో ప‌క్కా పీరియాడిక‌ల్ వండ‌ర్ ఈ చిత్రం. ఇందులో ఎన్టీఆర్ కు నెగిటివ్ షేడ్స్ ఉంటాయ‌ని.. క్లైమాక్స్ లో ఇద్ద‌రూ క‌లిసిపోతార‌ని తెలుస్తుంది. దీనికి మ‌ళ్లీ పున‌ర్జ‌న్మ‌ల ట‌చ్ కూడా ఇస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇప్పుడు లీక్ అయిన స్టిల్స్ లో కూడా బ్రిటీష్ జెండా క‌నిపిస్తుంది. దాన్నిబ‌ట్టి క‌థ అప్ప‌టిదే అని ఫిక్సైపోవ‌చ్చు.
పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే క‌థ‌.. దానికితోడు ఈ జ‌న్మ‌లో పోలీస్ గా చ‌ర‌ణ్.. ముస్లిం యువ‌కుడిగా ఎన్టీఆర్ పుడ‌తార‌ని తెలుస్తుంది. అప్ప‌ట్లో గురువు రాఘ‌వేంద్ర‌రావ్ సుభాష్ చంద్ర‌బోస్ అని తీసాడు. ఆయ‌న అప్పుడు ఫెయిల్ అయ్యాడు. అందుకే రాజ‌మౌళి గురువు చేసిన త‌ప్పుల‌ను చూసి మ‌ళ్లీ నేర్చుకుంటున్నాడు. ఈ సారి ట్రిపుల్ ఆర్ క‌థ మ‌రింత ప‌కడ్బంధీగా రాసుకున్నాడు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఇంకా మొద‌ల‌వ్వ‌క ముందే క‌ర‌ణ్ జోహార్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కోసం బేరం పెట్టేసాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 180 కోట్లు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చాడు క‌ర‌ణ్. 

బాహుబ‌లి అంటే విజువ‌ల్ వండ‌ర్ కాబ‌ట్టి ఓకే కానీ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తెలియ‌క‌పోయినా కేవ‌లం రాజ‌మౌళి బ్రాండ్ తో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ కు ఈ రేట్ ప‌ల‌క‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే. అయితే ఈ చిత్ర రైట్స్ ఎంత‌కు ఇవ్వాలి.. ఇవ్వాలా వ‌ద్దా అనేది మాత్రం నిర్మాత దాన‌య్య‌కే వ‌దిలేసాడు రాజ‌మౌళి. ఆయ‌న ఇష్ట‌మైతే ఇవ్వాలి.. లేదంటే లేదు. ఈ చిత్రాన్ని 300 కోట్ల‌తో నిర్మించ‌నున్నాడు దాన‌య్య‌. 2020 స‌మ్మ‌ర్ కు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. విడుద‌ల‌వ్వ‌క ముందే ఇన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఏం చేస్తుందో..?

More Related Stories