English   

రామ్ చరణ్ రంగస్థలం కథ ఇదేనా..?

ramcharan rangasthalam
2018-02-22 13:41:26

రామ్ చరణ్,స సుకుమార్, సమంత కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ రంగస్థలం. రామ్ చరణ్ చెవిటివాడుగా నటిస్తున్నాడనే మాట సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్స్ తో రీసెంట్ గా వచ్చిన పాటతో ఆడియన్స్ లోనూ విపరీతమైన హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలో రంగస్థలం కథేంటా అనే కుతూహలం చాలామందిలో ఉంది. అయితే మొన్న వచ్చిన పాటను బట్టో ఆ టీజర్స్ ను బట్టో కాకుండా సుకుమార్ ఇందులో మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ మిక్స్ చేశాడట. అదే సినిమాకు కీలక పాయింట్ గా చెబుతున్నారు. అదేంటో తెలియాలంటే రంగస్థలం కథంటూ చక్కర్లు కొడుతోన్న ఈ కథ మీకు తెలియాలి.

అనగనగా ఓ కుర్రాడు. ఆడుతూపాడుతూ హాయిగా తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు. చెవులు వినిపించవు. కానీ అతని కళ్లు దేన్నో నిరంతరం వెదుకుతుంటాయి. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ అంతా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ గా నడుస్తుంది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. తన అన్వేషణకు కారణం తెలుస్తుంది. అదే ఈ సినిమాలో కీలక పాయింట్. నిజానికి ఇది 1980ల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హత్యా రాజకీయాల చుట్టూ తిరుగే కథ.  ఆ క్రమంలోనే హీరో అన్న(ఆది పినిశెట్టి) రాజకీయ కక్షల్లో కొందరు చంపేస్తారు. అన్నను చంపినవారిపై ఈ చెవిటి వ్యక్తి ఎలా పగ తీర్చుకున్నాడు. ఇతనికీ లక్ష్మి(సమంత)కి మధ్య ఉన్న సంబంధం ఏంటీ అనేది మిగతా కథ. స్థూలంగా రంగస్థలం కథ ఇదేనంటూ ఇన్నర్ సోర్స్ నుంచి వినిపిస్తోన్న వార్త. ఏదేమైనా కథాగమనం మాత్రం అన్న దమ్ముల మధ్య అనుబంధం నేపథ్యంలో ఉంటుందనేది నిజం. ఆ రకంగా చూస్తే ఈ కథ ఆ కథకు దగ్గరగా ఉన్నట్టే. కాకపోతే ఈ కథను సుకుమార్ తనదైన స్టైల్లో చెప్పబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రంగస్థలం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉంది ఎంటైర్ టీమ్..

More Related Stories