English   

రియా చక్రవర్తి మిస్సింగ్..ఎక్కడా కనబడుట లేదు..

Rhea Chakraborty
2020-08-03 12:23:17

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సూసైడ్ చేసుకుని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతోపాటు ఆరుగురు వ్యక్తుల మీద సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వారివలనే సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంటూ ఐపీసీలోని 306 సెక్షన్‌ కింద ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే రియా చక్రవర్తి కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఈమె ఆచూకీ ముంబై సహా బిహార్ పోలీసులు ప్రయత్నిస్తున్నా కూడా అస్సలు కనిపించడం లేదట. సుశాంత్ అకౌంట్స్‌కు సంబంధించిన వివరాలు కూడా బీహార్ పోలీసులు సేకరిస్తున్నారు. అసలు రియా ఎక్కడుందో తెలిస్తే కచ్చితంగా ఈ కేసులో మరిన్ని వివరాలు కూడా బయటికి వస్తాయంటున్నారు పోలీసులు. ఈ కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని రియా సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది.  

More Related Stories