English   

టాలీవుడ్ హీరోలు జీహెచ్ఎంసీ ఎన్నికలను బాయ్ కాట్ చేశారా..

 NTR Ram charan
2020-12-01 13:35:17

అదేంటి అంతమాట అనేసారు అనుకుంటున్నారా.. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. నిజంగానే మన టాలీవుడ్ హీరోలు గ్రేటర్ ఎన్నికలను పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. ఓటు వేసి అందరికీ స్పూర్తిగా నిలవాల్సిన మన సెలబ్రిటీలు ఇంతవరకు పోలింగ్ బూత్ దగ్గర కనిపించలేదు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 1న పోలింగ్ డే అని తెలిసినా కూడా ఎవరు బూత్ దగ్గర కనిపించడం లేదు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి దంపతులు, నాగార్జున దంపతులు, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ కుటుంబం, మంచు లక్ష్మి మాత్రమే ఓటు వేశారు. వీళ్లు మినహాయిస్తే పోలింగ్ బూత్ దగ్గర మన టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కనిపించలేదు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, వినాయక్, వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, జగపతిబాబు, యంగ్ హీరోలు రామ్, నాని ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత అవుతుంది. వీళ్లల్లో ఏ ఒక్కరూ కూడా ఓటు వేయడానికి రాలేదు. మరి వీళ్ళిద్దరికీ ఓటు వేయడం ఇష్టం లేదా లేదంటే బయట కరోనా పరిస్థితులు ఉన్నాయని ఇంట్లోనే ఉండిపోయారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. దయచేసి ఓటు వేయండి అంటూ గొంతు చించుకొని రాజకీయ నాయకులు అరుస్తుంటే సినీ ప్రముఖులు మాత్రం ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి పోతున్నారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలైపోయాయి. మరి వీటికి ఎవరు సమాధానం చెబుతారు అనేది చూడాలి. ఏదేమైనా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సినీ ప్రముఖులు ఇలా ఓటుకు దూరంగా ఉండటం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి ఇంకా టైం ఉంది కదా వీరిలో ఎవరైనా ఓటు వేయడానికి వస్తారో లేదో.

More Related Stories