English   

ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవర్సీస్ లో భారీ నష్టాలు..

ismart
2019-08-24 07:53:14

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో భారీ లాభాలు తీసుకువచ్చింది సంక్రాంతికి వచ్చిన ఎఫ్2. ఆ తర్వాత అంత లాభాలు తీసుకు వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరీ జగన్నాథ్ నుంచి ఇచ్చిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఏకంగా 37 కోట్లకి పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. రామ్ కెరీర్లో తొలిసారి 30 కోట్ల మార్క్ ని అందుకుంది. దానికి తోడు పూరి జగన్నాథ్ కు కూడా దాదాపు 11 ఏళ్ల తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ ఇది. దేశముదురు తర్వాత ఆ స్థాయి సినిమా కోసం వేచి చూస్తూనే ఉన్నాడు పూరి జగన్నాథ్. మధ్యలో వచ్చిన బిజినెస్ మేన్, టెంపర్ లాంటి సినిమాలు ఓకే అనిపించాయి కానీ బ్లాక్ బస్టర్ కాదు. ఇన్నేళ్ల తర్వాత పూరీ నుంచి వచ్చిన అసలైన మాస్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏపీ తెలంగాణలో ఇస్మార్ట్ శంకర్ రికార్డు వసూళ్లు సాధించింది. బయ్యర్లకు లాభాల పంట పండించింది ఈ చిత్రం. కేవలం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ దానికి డబుల్ వసూలు చేసింది. అయితే ఏపీ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం ఇస్మార్ట్ శంకర్ దారుణంగా ఫ్లాప్ అయింది. పూరీ తెరకెక్కించిన ఊర మాస్ సినిమాను ఓవర్సీస్ ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేక పోయారు. దాంతో మన దగ్గర ఎన్ని లాభాలు వచ్చినా కూడా విదేశాల్లో మాత్రం దారుణంగా నష్టపోయింది ఇస్మార్ట్ శంకర్. ఇక్కడ నామమాత్రపు వసూళ్లు కూడా తీసుకురాలేకపోయింది ఈ చిత్రం. తెలుగు ఆడియన్స్ దగ్గర వర్కవుట్ అయిన డబుల్ దిమాక్ కాన్సెప్ట్ ఎన్నారైల దగ్గర వర్కౌట్ కాలేదు. అందుకే దేశీయంగా సంచలనం సృష్టించిన ఇస్మార్ట్ శంకర్ విదేశాల్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు వచ్చిన తర్వాత మన దగ్గర రెండింతలు లాభాలు తీసుకు వచ్చిన ఈ సినిమా అక్కడ మాత్రం రెండింతలు నష్టాలు తీసుకొచ్చింది.

More Related Stories