English   

మాల్దీవులలో ఇస్మార్ట్ శంకర్ 

 iSmart Shankar
2019-06-15 12:48:14

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇస్మార్ట్ శంక‌ర్’. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌  మీద ఈ సినిమాని పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. ప్రస్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో షూట్ చేస్తున్నారట. సినీ పాటల రచయిత భాస్కర భ‌ట్ల ర‌చించిన ఈ లవ్‌ సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్లలో చిత్రీక‌రిస్తున్నట్లు ఈ సినిమా యూనిట్ పేర్కొంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ యాసలో రామ్ చెబుతున్న డైలాగులు సరికొత్తగా అనిపిస్తున్నాయి. ఆ సంగతి పక్క పెడితే ఈ మధ్య రిలీజయిన దిమాక్ ఖ‌రాబ్, జిందాబాద్ జిందాబాద్ సాంగ్స్ రిలీజవగా ఆ పాటలకి జనం బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకుంటున్న ఈ సినిమాని జూలై 12న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శక నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అటు రామ్ కి ఇటు పూరీకి ఈ ఇద్దరికీ చాలా ముఖ్యమైన సినిమా, ఈ సినిమా హిట్ అయితేనే వారికి కెరీర్ కి ఉపయుక్తం.

More Related Stories