English   

మాజీ ప్రియుడిపై కంగ‌న య‌ద్ధం..!

kanagna
2018-07-24 15:35:14

కంగ‌న ర‌నౌత్ మాజీ ప్రియుడా ఎవ‌ర‌త‌ను అనుకుంటున్నారా..? బాలీవుడ్ గురించి కాస్త ప‌రిచ‌యం ఉన్నా కూడా అత‌నెవ‌రో ఈ పాటికే అర్థ‌మైపో యుంటుంది. హా.. మీరు ఊహించిన పేరు క‌రెక్టే.. అత‌డే హృతిక్ రోష‌న్. అప్ప‌ట్లో ఈ ఇద్ద‌రి మ‌ధ్య చాలా ర‌చ్చ జ‌రిగింది. ప్రేమ‌తో నిండిన‌ విర‌హంతో కూడిన బంధం వ‌ల్ల చాలా రోజుల పాటు ఒక‌ర్ని విడిచి ఒక‌రు ఉండ‌లేక‌పోయారు. మెయిల్స్ లో కూడా వీళ్ల ప్రేమాయ‌ణం సాగింది. కానీ ఆ త‌ర్వాత స‌డ‌న్ గా ఒక్క‌రోజు ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు తిట్టుకుని బంధంలోంచి బ‌య‌టికి వ‌చ్చేసారు. అయితే ఇప్పుడు మాజీ ప్రియుడిపైనే యుద్ధం చేయ‌డానికి వ‌చ్చేస్తుంది కంగ‌న‌. 

ఈమె న‌టిస్తోన్న మ‌ణిక‌ర్ణిక 2019 జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది. నిజానికి ఈ ఏడాదే రావాల్సిన ఈ చిత్రం అనుకోకుండా వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డింది. అయితే జ‌న‌వ‌రి 26న హృతిక్ రోష‌న్ సూప‌ర్ 30 ఉంది. అది తెలిసి కూడా కావాల‌నే త‌న సినిమా విడుద‌ల తేదీని కూడా అప్పుడే ఫిక్స్ చేసుకుంది కంగ‌న‌. హృతిక్ ఇమేజ్ తో పోలిస్తే కంగ‌న న‌థింగ్ కానీ.. సినిమా ప‌రంగా చూసుకుంటే మాత్రం ప‌ర్ 30 కంటే మ‌ణిక‌ర్ణిక‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. క్రిష్ దీన్ని తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. మొత్తానికి బాలీవుడ్ లో ఈ ప్రేమికుల స‌మ‌రంపై ఆస‌క్తి బాగానే పెరిగిపోతుంది. మ‌రి చివ‌రికి ఈ వార్ లో విజ‌యం సాధించేది ఎవ‌రో చూడాలిక‌..

More Related Stories