English   

25 లక్షలు పోగొట్టుకున్న మహేష్ బ్యూటీ

rash
2020-01-17 20:16:16

'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్నకు ఊహించని షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజపేటలో ఉన్న రష్మిక నివాసంపై గురువారం ఐటీ అధికారులు దాడులు జరిగాయి. అయితే.. ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్‌ ఆమెకు సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని.. ప్రస్తుతం తన తండ్రికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
కానీ తాజా సమాచారం ప్రకారం.. ఐటీ దాడుల సమయంలో రష్మిక  షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆమె పేరెంట్స్ ను అధికారులు ప్రశ్నించారట. అందులోభాగంగా రష్మిక బ్యాంక్‌ ఖాతాలతో పాటు మరిన్ని వివరాలు అడగ్గా.. వారు సరైన సమాధానం ఇవ్వలేదట. దాంతో ఆమె ఇంటికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే లెక్కలోకి రాని రూ. 25 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఈ తనిఖీలు జరిగినట్టు సమాచారం.
ఇకపోతే.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. తమిళ, మళయళంలో కొన్ని సినిమాలతో పాటు తెలుగులో నితిన్ సరసన 'భీష్మ'..అల్లు అర్జున్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ లోనూ నటించనుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా.. ప్రజంట్ రష్మిక జోరుకు పాతిక లక్షలు పెద్ద మ్యాటరేం కాదు అంటున్నారు.

 

More Related Stories